తేజు ఔట్.. వాళ్లిద్దరూ కూడా ఔటేనా?

తేజు ఔట్.. వాళ్లిద్దరూ కూడా ఔటేనా?

ఇండిపెండెన్స్ డే వీకెండ్లోనే థియేటర్లలోకి దిగిపోదామనుకున్నాడు 'జవాన్'. కానీ ఆ వీకెండ్లో పోటీ ఎక్కువుందని.. సోలోగా సెప్టెంబరు 1న రావడానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఆ తేదీకి 'పైసా వసూల్' ఫిక్సయింది. దీంతో 'జవాన్' విడుదలపై సందిగ్ధత నెలకొంది. సినిమాను వాయిదా వేయక తప్పని పరిస్థితి నెలకొంది.

ఐతే సినిమాను వాయిదా వేస్తున్నట్లు కానీ.. కొత్త విడుదల తేదీ గురించి కానీ చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు. అలా కామ్‌గా ఉన్నారంటే సెప్టెంబరు 1నే వచ్చేస్తారా అన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ గత రెండు వారాలుగా 'జవాన్'కు సంబంధించి ఏ ప్రమోషనల్ యాక్టివిటీ లేకపోవడంతో ఆ సినిమా వాయిదా పడటం పక్కా అని తేలిపోయింది. ఈ శుక్రవారం 'పైసా వసూల్' సోలోగా బరిలోకి దిగుతోంది.

ఇక తర్వాతి వారానికి ఏకంగా నాలుగు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి కానీ.. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే నాగచైతన్య సినిమా 'యుద్ధం శరణం' ఒక్కటే థియేటర్లలోకి దిగేలా కనిపిస్తోంది. రెండు నెలల కిందటే సెప్టెంబరు 8కి ఫిక్సయిన మంచు మనోజ్ సినిమా 'ఒక్కడు మిగిలాడు' కానీ.. అల్లరి నరేష్ సినిమా 'మేడ మీద అబ్బాయి' కానీ కొన్ని రోజులుగా వార్తల్లోనే లేవు. వాటికి సంబంధించి ప్రమోషన్లేమీ కనిపించట్లేదు.

ఓవైపు 'యుద్ధం శరణం' అగ్రెసివ్‌గా తమ సినిమాను ప్రమోట్ చేస్తూ దాన్ని వార్తల్లో నిలబెడుతుంటూ.. మనోజ్, నరేష్ సినిమాల గురించి చర్చే లేదు. చూస్తుంటే ఈ రెండు సినిమాలూ వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. వీటికి బిజినెస్ అనుకున్న స్థాయిలో కాలేదని.. దీంతో రిలీజ్ విషయంలో పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. మరోవైపు సచిన్ జోషి సినిమా 'వీడెవడు' గురించి పట్టించుకునే నాథుడే లేడసలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు