గౌత‌మ్ నా ప్ర‌పంచం....

గౌత‌మ్ నా ప్ర‌పంచం....

సాధార‌ణంగా సెల‌బ్రిటీలకు, అందులోనూ సినీ హీరోలకు త‌మ కుటుంబంతో గ‌డిపేందుకు స‌మ‌యం దొర‌క‌దు. ఎప్పుడూ షూటింగ్ ల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల్ల త‌మ పిల్ల‌ల‌తో కూడా ఎక్కువ‌గా టైం స్పెండ్ చేయ‌లేని ప‌రిస్థితి వారిది. అయితే, టాలీవుడ్ హీరోల‌లో ప్రిన్స్ మ‌హేష్ బాబుకు త‌న పిల్ల‌ల‌తో అటాచ్ మెంట్ చాలా ఎక్కువ‌.

వీలు దొరికిన‌ప్పుడ‌ల్లా గౌత‌మ్‌, సితార ల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేస్తుంటాడు ప్రిన్స్. స్పైడ‌ర్ షూటింగ్ స‌మ‌యంలో సితార త‌ర‌చుగా సెట్లో సంద‌డి చేసింది. సితార, గౌత‌మ్ లకు సంబంధించిన అప్ డేట్స్ ను  ప్రిన్స్‌, న‌మ్ర‌త‌లు సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో షేర్ చేసుకుంటారు. ఈ రోజు గౌత‌మ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ట్విట్ట‌ర్ లో శుభాకాంక్ష‌లు తెలిపాడు మ‌హేష్ బాబు.

గౌత‌మ్ 12వ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేష్‌ ట్విట్ట‌ర్ ద్వారా త‌న విషెస్‌ తెలియ‌జేశాడు. `నా అస్తిత్వానికి కార‌ణం వాడు.. న‌న్ను న‌డిపించేది వాడు.. నా కుమారుడు.. నా ప్ర‌పంచం.. నా ఆనందం.. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు, గౌత‌మ్‌.. ఆనందంగా ఉండు` అంటూ ప్రిన్స్‌ ట్వీట్ చేశాడు. మ‌హేష్‌, న‌మ్ర‌త‌ల‌కు 2006 ఆగ‌స్టు 31న గౌత‌మ్ జ‌న్మించాడు.

2012 జూలై 20న కూతురు సితార జ‌న్మించింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ ప్రిన్స్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది. సూప‌ర్ స్టార్ కృష్ణ‌, మ‌హేష్‌ బాబు లు ఒకే స్టైల్ లో కూర్చున్న ఫొటోను న‌మ్ర‌త నిన్న ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ ఫొటో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు