ప్రభాస్‌ 'సాహో'ని ఇంత పులిహోర చేస్తున్నారేంటి?

ప్రభాస్‌ 'సాహో'ని ఇంత పులిహోర చేస్తున్నారేంటి?

'బాహుబలి'తో ప్రభాస్‌కి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చి వుండొచ్చు గాక. కానీ అతను ప్రధానంగా టాలీవుడ్‌ హీరోనే. తెలుగు సినిమాగా ట్రీట్‌ చేసి జాతీయ వ్యాప్తంగా అప్పీల్‌ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి కానీ సరాసరి జాతీయ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తూ ఒక తెలుగు సినిమా తీయకూడదు. సాహో చిత్రం స్టార్‌ కాస్ట్‌ చూస్తుంటే బాలీవుడ్‌ మార్కెట్‌ని నిర్మాతలు ఎంత సీరియస్‌గా తీసుకున్నారనేది తెలుస్తోంది.

అలాగే అక్కడి మార్కెట్‌ని క్యాప్చర్‌ చేయడానికి తమ సినిమాలో సరిపడా సత్తా లేదనే అనుమానాలకి కూడా తావిస్తోంది. ఇప్పటికే హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌తో పాటు నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, టిన్ను ఆనంద్‌ అంటూ పలువురు బాలీవుడ్‌ నటులతో నింపేసిన ఈ చిత్రంలో తాజాగా మందిరా బేడీని తీసుకున్నారు.

తెలుగు ప్రేక్షకులకి పర భాషా నటులని చూడడం అలవాటేమో కానీ మరీ ఇలా ప్యాడింగ్‌ ఆర్టిస్టులంతా హిందీ వాళ్లే అయితే అదేదో అనువాద చిత్రాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. నేటివిటీ పూర్తిగా మిస్‌ అవుతుంది.

బాహుబలి ఇమేజ్‌ని దేశ వ్యాప్తంగా క్యాష్‌ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఒరిజినాలిటీ మిస్‌ అవుతోన్న సంగతిని ఈ చిత్ర బృందం గుర్తించలేకపోవడం శోచనీయం. దీని వల్ల సాహోకి ఎక్కువ డ్యామేజ్‌ జరగకుండా మనందరికీ నచ్చేలానే వుంటుందని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు