‘అర్జున్ రెడ్డి’ రీమేక్. అంత వీజీ కాదు

‘అర్జున్ రెడ్డి’ రీమేక్. అంత వీజీ కాదు

దక్షిణాదిన ఏదైనా ఒక భాషలో ఒక కొత్త తరహా సినిమా వచ్చిందంటే చాలు.. పొరుగు భాషల వాళ్ల కళ్లు పడిపోతాయి. రీమేక్ కోసం ఆరాలు మొదలవుతాయి. ఈ మధ్య అలా పొరుగు భాషల వాళ్లను బాగా ఆకర్షించిన తెలుగు సినిమా ‘ఆనందో బ్రహ్మ’. ఈ సినిమా కాన్సెప్ట్ ఏ భాషలో అయినా వర్కవుటయ్యేదే కాబట్టి ఇబ్బంది లేదు. కానీ గత శుక్రవారం విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలొస్తుండటం కొంచెం ఆశ్చర్యం కలిగించేదే.

ఊరికే ఊహాగానాలు చేయడం కాదు.. ప్రముఖ తమిళ క్రిటిక్ శ్రీధర్ పిళ్లై ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. తమిళ పరిశ్రమకు చెందిన పలువురు యువ కథానాయకులు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారని.. రీమేక్ రైట్స్ కోసం గట్టి పోటీ నెలకొందని.. రీమేక్ కన్ఫమ్ అయితే చెన్నైలో ‘అర్జున్ రెడ్డి’ షోలు ఆగిపోతాయి కాబట్టి తాను వెంటనే సినిమా చూసేయాలనుకుంటున్నానని శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశాడు.

ఐతే ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాను రీమేక్ చేసి.. ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయడం సాధ్యమా అన్నది సందేహం. ఇది ఎక్కువగా నేటివిటీతో ముడిపడ్డ సినిమా. తెలంగాణ.. హైదరాబాదీ నేటివిటీ ‘అర్జున్ రెడ్డి’కి పెద్ద బలంగా నిలిచింది. ఇక అర్జున్ రెడ్డి అన్నది ఒక ఒరిజినాలిటీ ఉన్న పాత్ర. దాన్ని అనుకరించడం అన్నది అంత సులువు కాదు. ఈ పాత్ర విజయ్ దేవరకొండ కోసమే పుట్టిందా అన్నట్లుగా అతను ఆ క్యారెక్టర్లో జీవించేశాడు.

ఇంకొకరు అతణ్ని అనుకరించే ప్రయత్నం చేస్తే ఎంతమాత్రం బాగుండదు. అలాగని కొంచెం భిన్నంగా చేసే ప్రయత్నం చేసినా ఆ పాత్ర చెడిపోతుంది. మొత్తంగా సినిమా కూడా అంతే. ఇలాంటి మ్యాజిక్స్‌ను రీక్రియేట్ చేయడం అన్నది అంత సులువైన విషయం కాదు. ఇలాంటి ప్రత్యేకమైన సినిమాల్ని ముట్టుకోకుండా అలా వదిలేయడమే బెటరేమో. ఐతే కోలీవుడ్ జనాలు పట్టుబట్టి ఈ సినిమాను రీమేక్ చేసే ప్రయత్నం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు