ఏఎన్నార్ లేరు.. అయినా అవి ఆగలేదు

ఏఎన్నార్ లేరు.. అయినా అవి ఆగలేదు

తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు తమకు ఇచ్చిన అతి పెద్ద ఆస్తి అభిమానులే అంటున్నాడు నాగార్జున. తన తండ్రిని అభిమానించిన వాళ్లు తనకంటే వయసులో చాలా పెద్ద వారైనప్పటికీ తన మీద చూపించే ప్రేమాభిమానాలకు వెల కట్టలేనని నాగ్ చెప్పాడు. ఏఎన్నార్ ఉన్నపుడు ఆయనకు వివిధ ప్రాంతాల్లో ఉన్న అభిమానుల నుంచి పచ్చళ్లు, మిఠాయిలు బహుమానంగా వచ్చేవన్నాడు.

ఐతే ఏఎన్నార్ వెళ్లిపోయాక అవేమీ ఆగిపోలేదని.. వాటిని ఇప్పుడు తనకు పంపిస్తున్నారని నాగార్జున తెలిపాడు. ఈ విషయంలో తాను గొప్ప అనుభూతికి లోనవుతుంటానని నాగ్ చెప్పాడు. తనకు మనసు బాగా లేదు అనుకున్నపుడల్లా అభిమానుల నుంచి ఫోన్లు వస్తుంటాయని.. వాళ్లు ఏదో ఒక మంచి విషయం చెబుతుంటారని.. అదెలా సాధ్యమో.. వాళ్లకు టెలిపతి లాంటిదేమైనా తెలుసేమో అనిపిస్తూ ఉంటుందని నాగ్ అన్నాడు. తన తండ్రి దగ్గర ఉంటూ చిన్నపుడు కలుసుకున్న అభిమానుల నుంచి ఇప్పుడు కూడా ఫోన్లు వస్తుంటాయని చెప్పాడు.

ఇక ఈ ఏడాది తెలుగు సినిమాలు అదరగొట్టేస్తుండటంపై నాగ్ స్పందిస్తూ.. లేటెస్ట్ రిలీజ్ ‘అర్జున్ రెడ్డి’ గురించి తాను మంచి విషయాలు విన్నానని.. చాలా సంతోషంగా అనిపించిందని.. అలాగే శేఖర్ కమ్ముల తీసిన ‘ఫిదా’ చూశానని.. బాగుందని.. అతను మంచి దర్శకుడని.. తెలుగులో కొత్త కొత్త కథలు వెలుగులోకి వస్తుండటం మంచి పరిణామమని నాగ్ అభిప్రాయపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు