ఆక్సిజన్ రిలీజ్.. నమ్మొచ్చా?

ఆక్సిజన్ రిలీజ్.. నమ్మొచ్చా?

మూడు నెలల కిందట గోపీచంద్ సినిమా ‘ఆరడుగుల బుల్లెట్’ను విడుదలకు ముస్తాబు చేశారు. రిలీజ్ డేట్ ఇచ్చి.. బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఐతే ఇంకొన్ని గంటల్లో షోలు పడాల్సి ఉండగా.. కథ అడ్డం తిరిగింది. విడుదల ఆగిపోయింది. కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అన్నారు. కానీ ఆ తర్వాత ఏ అప్ డేట్ లేదు. ఈ సినిమా ఎప్పటికైనా విడుదలవుతుందా అన్నది సందేహంగా ఉంది.

ఇదే తరహాలో విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గోపీచంద్ మరో సినిమా ‘ఆక్సిజన్’ ఇప్పుడు సడెన్‌గా వార్తల్లోకి వచ్చింది. అక్టోబరు 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటన ఇచ్చాడు నిర్మాత ఎ.ఎం.రత్నం.

ఐతే రెండేళ్లుగా నిర్మాణ దశలోనే ఉన్న ఈ సినిమాను ఇప్పుడు ఉన్నట్లుండి వార్తల్లోకి తీసుకొచ్చి రిలీజ్ అనే సరికి జనాలకు నమ్మశక్యంగా అనిపించట్లేదు. ‘గౌతమ్ నంద’ రిలీజ్‌కు ముందు గోపీచంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొంత బ్యాలెన్స్ ఉందన్నాడు. ఈ సినిమా పరిస్థితేంటో తనకు అర్థం కావట్లేదన్నట్లుగా మాట్లాడాడు. మరి బ్యాలెన్స్ షూటింగ్ ఎప్పుడు చేసి.. సినిమాను అక్టోబరుకు ఎలా రెడీ చేస్తారో చూడాలి.

ఒకవేళ సినిమా సిద్ధమైనా.. ‘రాజా ది గ్రేట్’, ‘రాజు గారి గది-2’ విడుదలయ్యే వీకెండ్లోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేస్తారంటూ ప్రకటన చేసేసరికి జనాలకు ఏమాత్రం నమ్మకం కుదరడం లేదు. ముందు ఈ సినిమాపై జనాల్లో చర్చ జరగాలన్న ఉద్దేశంతో ఇలా నామమాత్రంగా రిలీజ్ డేట్ ఇచ్చారేమో అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు