వెనీస్ లో మ‌ణిర‌త్నం కుమారుడి ఇక్క‌ట్లు!

వెనీస్ లో మ‌ణిర‌త్నం కుమారుడి ఇక్క‌ట్లు!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, సుహాసిని దంపతుల కుమారుడు నందన్ కు ఇట‌లీలో చేదు అనుభ‌వం ఎదురైంది. వెనీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న నంద‌న్ దోపిడీకి గురయ్యాడు. ఎలా జ‌రిగిందో, ఎంత సొమ్ము పోయిందో వివరాలు తెలియదు కానీ, నంద‌న్ చేతిలో చిల్లి గ‌వ్వ లేని నిస్స‌హాయ స్థితికి చేరుకున్నాడు. దీంతో, త‌న కుమారుడు దోపిడీకి గురై ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో ఉన్న విషయాన్ని సుహాసిని ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇటలీలోని వెనిస్‌ విమానాశ్రయం దగ్గర్లో ఎవరైనా తెలిసిన వారుంటే తమ కుమారుడికి సాయం చేయాల్సిందిగా ఆమె ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ కు స్పందించిన కొంద‌రు నంద‌న్ కు స‌హాయం చేశారు.

ఎవరైనా వెనిస్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉంటే మా అబ్బాయికి సాయం చేయండి ప్లీజ్ అంటూ నంద‌న్ ఫోన్ నెంబ‌ర్ ను  సుహాసిని ట్వీట్ చేశారు. ‘నంద‌న్‌ బెలున్నో ప్రాంతంలో ఉండగా దోపిడీకి గురయ్యాడు. ఒక వేళ వెనిస్‌లో ఉండి సాయం చేయలేని వారెవరూ మా అబ్బాయి ఫోన్‌ నెంబర్‌కు దయచేసి ఫోన్‌ చేయకండి. ఎందుకంటే అతని ఫోన్‌లో బ్యాటరీ తక్కువగా ఉంది. మేము అతనితో కాంటాక్ట్‌ను కోల్పోయే అవకాశం ఉంది’ అని సుహాసిని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ చేసిన కొద్ది సేప‌టికే నంద‌న్ కు కొంత‌మంది వ్య‌క్తులు సాయం చేశారు. దీంతో, కొద్దిసేపటికే నందన్‌ క్షేమంగానే ఉన్నాడని, ఓ హోటల్‌లో దిగాడని  సుహాసిని ట్వీట్ చేశారు. త‌న ట్వీట్ కు స్పందించి త‌మ కుమారుడికి సాయం చేసిన వారందరికీ సుహాసిని ధన్యవాదాలు తెలిపారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు