బంగార్రాజు లైన్ నచ్చలేదు-నాగ్

బంగార్రాజు లైన్ నచ్చలేదు-నాగ్

అక్కినేని నాగార్జున కెరీర్లోనే అత్యధిక వసూళ్లతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమా 'సోగ్గాడే చిన్నినాయనా'. ఈ సినిమాలో బంగార్రాజు క్యారెక్టర్ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో తెలిసిందే. ఈ పాత్రను తీసుకుని 'బంగార్రాజు' పేరుతో ఇంకో సినిమా చేయాలని ఆశించారు నాగార్జున, దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.

ఐతే ఈపాటికే మొదలవ్వాల్సిన ఈ సినిమా ముందుకు కదల్లేదు. దాని గురించి అప్ డేట్ లేదు. మంగళవారం తన పుట్టిన రోజు నేపథ్యంలో మీడియాను కలిసిన నాగ్ ఈ సినిమా విషయమై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా విషయంలో నాగ్ సందేహాలు వ్యక్తం చేశాడు.

కళ్యాణ్ కృష్ణ తనకు చెప్పిన 'బంగార్రాజు' లైన నచ్చలేదని.. దీంతో సినిమా హోల్డ్‌లో పెట్టామని నాగ్ తెలిపాడు. అతను తనను కథతో మెప్పిస్తే ఎప్పుడైనా ఆ సినిమాను మొదలుపెట్టేస్తామని నాగ్ చెప్పాడు. ఐతే 'సోగ్గాడే చిన్నినాయనా'కు సీక్వెల్ లాగా అది ఉండొద్దన్నది తన అభిప్రాయమని నాగ్ చెప్పాడు.

మలయాళ మహాభారతంలో నటించే విషయంపైనా నాగ్ స్పందించాడు. తనను ఆ చిత్ర బృందం సంప్రదించిన మాట వాస్తవమే కానీ.. కర్ణుడి పాత్ర కోసం అడిగారని.. ఐతే తాను ఆ సినిమా చేస్తానా లేదా అన్నది ఇంకా తెలియదని.. ఈ చిత్రం 2018లో సెట్స్ మీదికి వెళ్లే అవకాశముందని నాగ్ తెలిపాడు.

ప్రస్తుతం తాను నటిస్తున్న 'రాజు గారి గది-2' పూర్తయిందని.. సెప్టెంబరు రెండో వారంలో ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని.. అక్టోబరు 13న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందని తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు