బాలయ్యలా చైతన్య కూడా రాత మారుస్తాడా?

బాలయ్యలా చైతన్య కూడా రాత మారుస్తాడా?

ఆల్‌మోస్ట్‌ ఫేడవుట్‌ అయిపోయిన దశ నుంచి జగపతిబాబు ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా వెలిగిపోతున్నాడంటే అందుకు కారణం 'లెజెండ్‌' సినిమానే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్యకి విలన్‌గా నటించడానికి అంగీకరించడం జగపతిబాబు రాత మార్చేసింది.

ఆ చిత్రం తర్వాత జగపతిబాబు తెలుగు చిత్ర సీమలోనే కాకుండా మొత్తం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాస్ట్‌లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కమ్‌ విలన్‌గా అవతరించాడు. ఇప్పుడు ఏ భారీ సినిమా చూసినా జగపతిబాబు పేరు ఖచ్చితంగా వుంటోంది.

ఈ నేపథ్యంలో జగపతిబాబులానే ఫ్యామిలీ సినిమాలతో హీరోగా చాలా సక్సెస్‌లు చూసిన శ్రీకాంత్‌ కూడా విలన్‌గా మారిపోయాడు. మొదట్లో విలన్‌ పాత్రలతోనే కెరియర్‌ స్టార్ట్‌ చేసినా కానీ హీరో అయ్యాక విలన్‌గా నటించని శ్రీకాంత్‌ 'యుద్ధం శరణం' చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.

ఇందులో శ్రీకాంత్‌ గెటప్‌ చాలా బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి. అయితే జగపతిబాబులా శ్రీకాంత్‌కి కూడా ఈ చిత్రం టర్నింగ్‌ పాయింట్‌ కాగలదా? తెలుగు సినిమాకి మరో నమ్మకమైన విలన్‌ దొరికేసినట్టేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు