రమ రాజమౌళి.. తొలిసారి అలా

రమ రాజమౌళి.. తొలిసారి అలా

రమ రాజమౌళి గురించి పరిచయాలు అక్కర్లేదు. రాజమౌళి భార్యగా.. రాజమౌళి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఎంతో గౌరవం సంపాదించుకుంది రమ. ప్రొఫెషనల్‌గా రమ ప్రతిభ ఏంటన్నది ఆమె పని చేసిన సినిమాలే చెబుతాయి. ఐతే ఆమె ప్రతిభ కేవలం రాజమౌళి సినిమాలకే పరిమితం అయిపోతూ వచ్చింది ఇన్నాళ్లూ.

ఎవ్వరూ ఆమెను అడగలేదో.. లేక ఆమే వేరే సినిమాలకు పని చేయడం ఇష్టం లేక ఊరుకుందో.. కారణమేదైనా సరే రాజమౌళి సినిమాల్ని దాటి ఇప్పటిదాకా రమ బయటికే రాలేదు. ఐతే తొలిసారి ఆమె ఓ బయటి సినిమాకు పని చేసింది. ఆ చిత్రానికి రాజమౌళికి ఏ సంబందం లేదు. ఐతే ఆ బయటి సినిమాకు పని చేసేందుకు కారణమైంది మాత్రం రమ కొడుకు కార్తికేయనే.

కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్‌గా.. రాజమౌళి మిత్రుడు సాయి కొర్రపాటి నిర్మాణంలో 'యుద్ధం శరణం' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేయడం విశేషం. ఈ విషయాన్ని రాజమౌళే స్వయంగా వెల్లడించాడు. తన మిత్రుడు సాయికి దూకుడెక్కువ అని.. 'యుద్ధం శరణం' కథ బాగా నచ్చి సినిమా చేస్తున్నాననగానే తాను కొంచెం కంగారు పడ్డానని.. ఐతే తన భార్య రమ ఈ కథ గురించి గొప్పగా మాట్లాడిందని.. 'బాహుబలి'కి ఎలా అయితే తాము పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యామో అంత బాగా కృష్ణ అండ్ టీమ్ ప్రిపేరైందని.. ఈ కథ కూడా చాలా బాగుందని.. తాను కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పని చేస్తానని రమ చెప్పడంతో తనకు ఈ సినిమాపై గురి కుదిరిందని రాజమౌళి చెప్పాడు.

ఈ సినిమా ట్రైలర్లో వచ్చే ''పరుగెత్తే ప్రతి ఒక్కడూ పారిపోతున్నట్లు కాదు'' అనే డైలాగ్ కూడా సినిమాపై తనకు నమ్మకం పెంచిందని.. అలాగే ఈ సినిమా షూటింగ్ ఒక రోజు దగ్గర్నుంచి చూశానని.. అప్పుడు కూడా తనకు సినిమాపై నమ్మకం పెరిగిందని రాజమౌళి చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు