పవన్ పుట్టిన రోజుకు ఏమీ లేదా?

పవన్ పుట్టిన రోజుకు ఏమీ లేదా?

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మొదలై ఆరు నెలలు దాటింది. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించిన ఏ విశేషమూ బయటికి రాలేదు. ఫస్ట్ లుక్ ఇదిగో అదిగో అంటూనే ఉన్నారు. కానీ అభిమానుల ముచ్చట తీరడం లేదు. రెండు రోజుల కిందట ఈ సినిమా ఫస్ట్ లుక్ పవన్ పుట్టిన రోజు కానుకగా సెప్టెంబరు 2న లాంచ్ చేయబోతున్నట్లుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఏమైందో ఏమో.. అంతలోనే దాన్ని వెనక్కి తీసుకున్నారు. సెప్టెంబరు 2న పవన్-త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసే ఆలోచనను విరమించుకున్నట్లుగా ప్రచారం నడుస్తోందిప్పుడు.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో నాలుగు నెలల ముందే ఫస్ట్ లుక్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదన్న చర్చ యూనిట్ వర్గాల్లో మొదలైనట్లు సమాచారం. పవన్ పుట్టిన రోజుకు ఫస్ట్ లుక్ లాంచ్ చేయాలా వద్దా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యకమవుతున్నాయట. ఈ చర్చ ఇంకా ఒక కొలిక్కి రాలేదని.. ఇంకో రెండు రోజుల తర్వాత ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఐతే ఫస్ట్ లుక్ లాంచ్ హింట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌తోనే పవన్ అభిమానులకు పిచ్చెక్కిపోయారు. ఫస్ట్ లుక్ కోసం వాళ్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పవన్ పుట్టిన రోజుకు ఏ విశేషం లేకపోతే వాళ్లు తీవ్ర నిరాశకు గురవుతారనడంలో సందేహం లేదు. కాబట్టి ఫస్ట్ లుక్ లాంచ్ చేసేస్తేనే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు