పవన్‌కళ్యాణ్‌ తర్వాత ఎన్టీఆర్‌కే

పవన్‌కళ్యాణ్‌ తర్వాత ఎన్టీఆర్‌కే

పవన్‌తో త్రివిక్రమ్‌ చేస్తోన్న సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే సంగతి తెలిసిందే. అది పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ కమిట్‌ అయిన చిత్రం సెట్స్‌ మీదకి వెళుతుందట. జై లవకుశ సెప్టెంబర్‌లో రిలీజ్‌ అవుతున్నా కానీ ఆ తర్వాత మూడు నెలల పాటు ఎన్టీఆర్‌ ఖాళీగానే వుంటాడని, మరో సినిమా ఏదీ చేయడని తెలిసింది. అయితే త్రివిక్రమ్‌ కోరిన విధంగా తన లుక్‌ మార్చుకోవడానికి ఎన్టీఆర్‌ ఈ సమయాన్ని కేటాయిస్తాడట.

ఇదిలావుంటే ఎన్టీఆర్‌తో తీసే చిత్రానికి కూడా అనిరుధ్‌తోనే మ్యూజిక్‌ చేయించుకోవడానికి త్రివిక్రమ్‌ ఫిక్స్‌ అయ్యాడట. తమిళంలో నంబర్‌వన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన అనిరుధ్‌ని పవన్‌ సినిమాతో తెలుగు చిత్ర సీమకి పరిచయం చేస్తోన్న సంగతి విదితమే. అతడిని తన తదుపరి చిత్రానికి కూడా కొనసాగించాలని త్రివిక్రమ్‌ డిసైడ్‌ అయ్యాడని, అనిరుధ్‌ కూడా త్రివిక్రమ్‌తో మళ్లీ పని చేయడానికి సిద్ధంగా వున్నాడని సమాచారం.

అనిరుధ్‌ మ్యూజిక్‌కి ఎన్టీఆర్‌ ఎనర్జిటిక్‌ డాన్సులు చూడాలని కోరుకునే అభిమానులకి ఇంతకంటే స్వీట్‌ న్యూస్‌ ఏముంటుంది? ఇకపోతే ఎన్టీఆర్‌కి టోటల్‌ మేకోవర్‌ ఇచ్చి సరికొత్తగా ప్రెజెంట్‌ చేయడానికి త్రివిక్రమ్‌ ఒక కొత్త క్యారెక్టరైజేషన్‌ సిద్ధం చేసాడని, ఎన్టీఆర్‌ని పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా మార్చే విధంగా ఇది వుంటుందని ఇన్‌సైడర్స్‌ చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు