పాపం నితిన్‌కి వెరీ బ్యాడ్‌ టైమ్‌!

పాపం నితిన్‌కి వెరీ బ్యాడ్‌ టైమ్‌!

వరుస విజయాలతో దూసుకెళుతోన్న నితిన్‌కి 'లై'తో డిజాస్టర్‌ ఎదురైంది. ఈ చిత్రం దారుణంగా ఫ్లాప్‌ అయ్యేసరికి నితిన్‌ మార్కెట్‌ని ట్రేడ్‌ శంకిస్తోంది. ఇద్దరు యువ హీరోలతో పోటీ పడిన టైమ్‌లో నితిన్‌ లాస్ట్‌ వచ్చాడు. ఆచిత్రం పరాజయాన్ని జీర్ణించుకుని మూవ్‌ అయ్యేలోగానే నితిన్‌కి 'అర్జున్‌ రెడ్డి' రూపంలో ఇంకో షాక్‌ తగిలింది. ఇంతకాలం తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద స్టార్‌ హూదాని నితిన్‌ ఎంజాయ్‌ చేస్తూ వచ్చాడు.

అతని చిత్రాలకి నైజాంలో మాత్రం గ్యారెంటీ వసూళ్లు వచ్చేవి. అయితే అర్జున్‌ రెడ్డితో తారాపథంలోకి దూసుకొచ్చిన విజయ్‌ దేవరకొండని తెలంగాణా లేటెస్ట్‌ సూపర్‌స్టార్‌ అంటున్నారు. రాంగోపాల్‌వర్మ ఒక అడుగు ముందుకేసి తెలంగాణ మెగాస్టార్‌ అంటూ అతనిపై ప్రశంసలు కురిపించాడు. నితిన్‌ తెలంగాణా యాసని తన సినిమాల్లో వాడింది తక్కువ. విజయ్‌ అచ్చంగా తెలంగాణ యాసలోనే మాట్లాడుతున్నాడు.

దీంతో అతడిని తెలంగాణా ప్రజలు మరింతగా ఓన్‌ చేసుకుంటున్నారు. లై హిట్‌ అయి వుంటే అర్జున్‌ రెడ్డి వల్ల నితిన్‌కి ఫరక్‌ పడేది కాదు కానీ అది డిజాస్టర్‌ అయిన టైమ్‌లో విజయ్‌ తారాజువ్వలా ఎగసి రావడం నితిన్‌కి కాస్త ఇబ్బందికరమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు