కాజల్ తర్వాత తమన్నానే

కాజల్ తర్వాత తమన్నానే

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో ‘అతనొక్కడే’, ‘పటాస్’ తప్ప వేరే హిట్లు లేవు. అతను ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. దీంతో కెరీర్లో స్టార్ హీరోయిన్లతో జత కట్టే అవకాశం పెద్దగా రాలేదు. ఐతే కళ్యాణ్ రామ్ చివరగా చేసిన  ‘ఇజం’ డిజాస్టర్ అయినా సరే.. అతను ఇప్పుడు నటిస్తున్న ‘ఎమ్మెల్యే’లో కాజల్ అగర్వాల్ లాంటి పెద్ద స్టార్ హీరోయిన్‌తో జత కడుతున్నాడు.
ఐతే స్టార్ ఇమేజ్ సంపాదించాక వరుసగా పెద్ద స్టార్లతోనే నటిస్తూ వచ్చిన కాజల్ ఈ మధ్య కొంచెం జోరు తగ్గించింది. రానా లాంటి మీడియం రేంజి హీరోతో కలిసి నటించింది. ఇప్పుడు కళ్యాణ్ రామ్‌కు జోడీగా నటిస్తోంది. తన కెరీర్ కళ్యాణ్ రామ్ సినిమాతోనే మొదలైన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

ఆ సంగతలా వదిలేస్తే.. కాజల్ తర్వాత మరో స్టార్ హీరోయిన్‌తో జత కట్టబోతున్నాడు. ఆమె మరెవరో కాదు.. మిల్కీ బ్యూటీ తమన్నా. ‘ఎమ్మెల్యే’ తర్వాత కళ్యాణ్ రామ్ ‘180’ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కబోయే ఈ చిత్రానికి తమన్నాను కథానాయికగా ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది.

కళ్యాణ్ రామ్ దగ్గర చాలా ఏళ్లుగా పీఆర్వోగా చేస్తున్న మహేష్ కోనేరు ఈ చిత్రంతో నిర్మాతగా మారుతుండటం విశేషం. ఈ సినిమాకు లెజెండరీ కెమెరామన్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి ఈ సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో రెండు భాషలకూ కనెక్టయ్యే తమన్నాను కథానాయికగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు