పైసా.. పైసలు దండగేనా?

పైసా.. పైసలు దండగేనా?

కృష్ణవంశీ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న సినిమా పైసా. గత సంవత్సరం దసరా పండుగ నాడు సినిమా విడుదల కావల్సి ఉన్నా, ఇంతవరకు సినిమా జనాల ముందుకురాలేదు. నిన్ననే రిలీజైన ఆడియోకు బాగా స్పందన వచ్చినా, ట్రయిలర్‌ చాలా బాగానే ఉన్నా, ఎందుకో సినిమాకు పెట్టిన పైసలు మొత్తం దండగే అనే టాక్‌ వినిపిస్తోంది.

నిజానికి ఈ సినిమాను 15 కోట్ల బడ్జెట్‌లో ఫినిష్‌ చెయ్యాలి. అయితే అనివార్యకారణాల వలన సినిమా చాలా లేట్‌ అయిపోవడంతో, ఆ బడ్జెట్‌ ఇప్పుడు వడ్డీలతో కలుపుకొని డబుల్‌ అయ్యింది. అంటే సినిమా సూపర్‌ డూపర్‌ హిట్టయినా కూడా నిర్మాత పుప్పాల రమేష్‌కు లాభం చేకూరదని తెలుస్తోంది.

పైగా ఇదే విషయాన్ని స్వయంగా దర్శకుడు కృష్ణవంశీ కూడా ఆడియో ఫంక్షన్‌లో చెప్పడం విశేషం. మరి లాస్‌లో ఉండి కూడా సినిమాను ఎందుకు రిలీజ్‌ చేస్తున్నారంటే, లాస్‌ వచ్చిందికదా అని సినిమాను ఆపేసుకోలేం కదా, కనీసం విడుదల చేస్తే ఎంతోకొంత రికవరి అవుతుందని వీరి ఫీలింగ్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు