బాలయ్య-పూరి.. మళ్లీ?

బాలయ్య-పూరి.. మళ్లీ?

నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా అంటూ ముందుగా వార్తలు వచ్చినపుడు చాలామంది నమ్మలేదు. ఇది జస్ట్ రూమరే అనుకున్నారు. ఎందుకంటే వాళ్లిద్దరిదీ పూర్తి భిన్నమైన శైలి. ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తారని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అనుకోనిదే నిజమైంది.

పూరి, బాలయ్య కలిసి 'పైసా వసూల్' చేశారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఒకరికొకరు బాగా నచ్చేశారని.. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంకో సినిమా కూడా వస్తుందని ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. 'పైసా వసూల్' షూటింగ్ అవ్వగానే బాలయ్యకు పూరి మరో కథ చెప్పగా.. తప్పకుండా సినిమా చేద్దామని ఆయన అన్నట్లుగా చెబుతున్నారు.

'పైసా వసూల్' ఔట్ పుట్ చూసి సంతృప్తి చెందిన బాలయ్య.. పూరికి మరో అవకాశం ఇవ్వడానికి ఓకే అన్నాడట. బాలయ్యతో తొలి ప్రయత్నంలో గ్యాంగ్ స్టర్ సినిమా చేసిన పూరి.. ఈసారి పొలిటికల్ డ్రామా చేయబోతున్నాడట. ఆ సినిమా లైన్ వరకు చెప్పిన పూరి.. త్వరలోనే దాన్ని డెవలప్ చేసి బాలయ్యకు వినిపించబోతున్నట్లు సమాచారం.

బాలయ్య ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిదే. 'పైసా వసూల్' బాగా ఆడితే.. పూరి విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేసే అవకాశముంది. ఆ తర్వాత ఇద్దరి కాంబినేషన్లో రెండో సినిమా రావచ్చు. 'పైసా వసూల్' సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు