అజిత్ పై త‌మిళ తంబీల ఇడ్లీ ప్రేమ‌!

అజిత్ పై త‌మిళ తంబీల ఇడ్లీ ప్రేమ‌!

మ‌న దేశంలో స్టార్ హీరోలు మొద‌లుకొని అప్ క‌మింగ్ హీరోల వ‌ర‌కు ఎవ‌రి స్థాయిలో వారికి అభిమాన సంఘాలున్నాయి. త‌మ అభిమాన హీరోల సినిమాల విడుద‌ల సంద‌ర్భంగా వారి ప్రేమ‌ను చాటుకోవ‌డం ఫ్యాన్స్ కు అల‌వాటు. కొంద‌రు అభిమానులు హీరోల కటౌట్ల‌కు పాలాభిషేకాలు చేసేసి నానా హంగామా చేస్తుంటారు. ఉత్తరాదితో పోల్చుకుంటే ద‌క్షిణాదిన‌, అందులోనూ త‌మిళనాడులో ప్ర‌జ‌లు... సినీ హీరోల‌ను త‌మ ఆరాధ్య దైవాలుగా కొలుస్తుంటారు. కోలీవుడ్ లో దాదాపుగా ప్ర‌తి హీరోకు అభిమాన సంఘాలు ఉన్నాయి. త‌మ హీరోల సినిమాల రిలీజ్ ను వారు ఒక వేడుక‌లా చేసుకుంటారు. మిగ‌తా ఇండ‌స్ట్రీల‌తో పోలిస్తే త‌మిళ తంబీల‌కు ఈ అభిమాన‌పు జాడ్యం కాస్త ఎక్కువే.

కోలీవుడ్ లో ర‌జనీకాంత్ కు భారీగా అభిమానులున్న సంగ‌తి తెలిసిందే. అయితే, త‌లైవా త‌ర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్‌. అజిత్ న‌టించిన "వివేగం" ఈరోజు  ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల‌యింది. ఈ సినిమాను తెలుగులో వివేకం పేరుతో విడుద‌ల చేశారు. అజిత్ సినీరంగంలో 25 సంవ‌త్స‌రాలు విజ‌య‌వంతంగా పూర్తిచేసుకోవ‌డంతో పాటు, ఆయ‌న కెరీర్ లో ఇది 57వ చిత్రం కావడం అభిమానులు ఈ సంద‌ర్భాన్ని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేశారు.  నార్త్ మద్రాస్ కు చెందిన వీర చెన్నై అజిత్ ఫ్యాన్స్ క్లబ్ వారు ఈ వేడుక‌ను వినూత్నత‌ర‌హాలో నిర్వ‌హించాల‌ని ఆలోచించారు. వారి ఆలోచ‌న‌తో 57 కిలోల బరువైన ఇడ్లీని అజిత్ ఆకృతి లో తయారు చేయించారు. త‌మిళుల‌కు ఎంతో ఇష్ట‌మైన ఇడ్లీ-సాంబార్ ద్వారానే త‌మ అభిమానాన్ని చాటుకోవ‌డం వారికి అల‌వాటే. గ‌తంలో అబ్దుల్ కలాం - మదర్ థెరిస్సా - జవహర్లాల్ నెహ్రూ వంటి వారిపై కూడా ఇడ్లి ప్రేమను చాటుకున్నారు త‌మిళ తంబీలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు