'సైరా' టైటిల్.. ఊరికే పెట్టేయలేదు

 'సైరా' టైటిల్.. ఊరికే పెట్టేయలేదు

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు అందరూ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే టైటిలే అనుకున్నారు. వారం పది రోజుల ముందు వరకు కూడా ఈ టైటిల్‌కే ఫిక్సయి ఉన్నారు. కానీ ఉన్నట్లుండి సీన్ మారిపోయింది. ఈ చిత్రానికి 'సైరా' అంటూ కొత్త టైటిల్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ టైటిల్ విషయంలో జనాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ఈ టైటిల్లో ఫోర్స్ ఉందని, బాగుందని అంటే.. ఇంకొందరేమో మామూలు మసాలా సినిమాకు పెట్టినట్లు 'సైరా' అని టైటిల్ పెట్టారేంటి అని పెదవి విరిచారు. చక్కగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. ఐతే ఈ టైటిల్ విషయంలో విమర్శలు గుప్పిస్తున్న వారికి సమాధానంగా సోషల్ మీడియాలో ఒక పద్యాన్ని షేర్ చేస్తున్నారు.

''సైరా నరసింహారెడ్డి.. నీ పేరే బంగార్పు కడ్డీ..
రాజారావు తావుబహద్దరు నారసింహారెడ్డి..
రెడ్డి కాదు బంగార్పుకడ్డి నారసింహారెడ్డి..
ముల్ కోల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికీ మొనగాడు రెడ్డి..''

..ఇలా సాగుతుంది ఆ పద్యం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం, గొప్పదనం గురించి చెబుతూ ఈ పద్యాన్ని తయారు చేశారట అప్పట్లో ఆయన అభిమానులు. రాయలసీమలో ఊరూరా అప్పట్లో ఈ పాట పాడుకునేవారట. 'సైరా నరసింహారెడ్డి' అనేది అప్పట్లో ఒక ఊతపదం లాగా ఉండేదట. అది వినగానే జనాల్లో ఒక ఉత్సాహం వచ్చేదట. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఉయ్యాలవాడ చరిత్రను అధ్యయనం చేసిన పరుచూరి సోదరులు ఈ సినిమాకు 'సైరా.. నరసింహారెడ్డి' అనే టైటిల్ పెడితే బాగుంటుందని చెబితే.. అందరూ ఓకే అన్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు