మలయాళ హీరో భార్య కూడా జైలుకేనా?

మలయాళ హీరో భార్య కూడా జైలుకేనా?

మలయాళ నటి కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో దిలీప్ నెల కిందట అరెస్టయి జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకూ దిలీప్‌కు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు దొరుతుండటంతో అతను ఈ కేసులో గట్టిగానే ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. దిలీప్ ఇప్పుడిప్పుడే ఈ కేసు నుంచి బయటపడే అవకాశాలు లేవన్న సంకేతాలు వస్తున్నాయి. ఐతే దిలీప్‌తో పాటుగా అతడి భార్య కావ్య మాధవన్ సైతం ఈ కేసులో జైలుకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని కేరళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

హీరోయిన్ కిడ్నాప్.. లైంగిక వేధింపుల్లో కీలకంగా వ్యవహరించిన నిందితుడు పల్సర్ సునీ పోలీసుల విచారణంలో పరోక్షంగా కావ్య పేరు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. నేరుగా కావ్య పేరెత్తకుండా తాను 'మేడం' ఆదేశాల మేరకే ఆ రోజు హీరోయిన్ని కిడ్నాప్ చేశానని.. ఆ మేడం ముందే తనకు కొంత డబ్బు కూడా ఇచ్చిందని పల్సర్ సునీ పోలీసులకు చెప్పినట్లుగా కేరళ మీడియా పేర్కొంది. ఆ 'మేడం' కావ్యనే అని అక్కడి వాళ్లు తీర్మానిస్తున్నారు. హీరోయిన్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కావ్యకు ఏముందన్న ప్రశ్న తలెత్తవచ్చు.

కావ్య దిలీప్‌కు మొదటి భార్య కాదు. ఈమె కంటే ముందు స్టార్ హీరోయిన్ మంజు వారియర్‌ను పెళ్లాడాడు దిలీప్. ఆ తర్వాత కావ్యతో ఎఫైర్ మొదలుపెట్టాడు. ఐతే దిలీప్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్న సమయంలో బాధితురాలైన హీరోయిన్.. వీళ్లిద్దరి వ్యవహారం గురించి మంజుకు చెప్పి ఇంట్లో పెద్ద గొడవలు జరగడానికి.. తర్వాత దిలీప్ నుంచి మంజు విడిపోయి భారీగా భరణం పొందడానికి కారకురాలైనందన్న కోపం దిలీప్‌తో పాటు కావ్యకు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్లిద్దరూ ఆమె కిడ్నాప్‌కు కలిసి ప్లాన్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు