బిగ్-బికి బాలయ్య ఫ్యాన్స్ థ్యాంక్స్!

బిగ్-బికి బాలయ్య ఫ్యాన్స్ థ్యాంక్స్!

మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి నందమూరి అభిమానులు ఉడికిపోతున్నారని.. బాలయ్య సినిమా ‘రైతు’కు ఓకే చెప్పని అమితాబ్ చిరు సినిమాను మాత్రం ఎలా ఒప్పుకున్నారంటూ నందమూరి అభిమానులు ఫ్రస్టేట్ అవుతున్నారని డిస్కషన్లు నడుస్తున్నాయి.

కానీ అమితాబ్ ‘నో’ అన్నందుకు సంతోషించాలే తప్ప బాధపడేది ఏముందని బాలయ్య అభిమానులే ప్రశ్నిస్తున్న సంగతి కూడా పట్టించుకోవాల్సిందే. బాలయ్య సినిమాకు నో అని చిరు సినిమాకు ఓకే చెప్పడం వల్ల నందమూరి అభిమానుల అహం దెబ్బతిందన్న కోణంలోనే అందరూ ఆలోచిస్తున్నారు.

కానీ అమితాబ్ నో అనడం వల్ల బాలయ్య సేఫ్ అయ్యాడని ఆలోచిస్తున్న ఫ్యాన్స్ కూడా లేకపోలేదు. ఎందుకంటే అమితాబ్ ఓకే చెప్పి ఉంటే.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ తర్వాత బాలయ్య ‘రైతు’ సినిమానే చేసేవాడు. ఐతే కృష్ణవంశీ ప్రస్తుతం ఎలాంటి ఫాంలో ఉణ్నాడన్నది మొన్న ‘నక్షత్రం’తోనే అందరికీ అర్థమైంది. ఆ సినిమా చూశాక.. హమ్మయ్య బాలయ్య ‘రైతు’ చేయకపోవడం మంచిదే అయింది అని ఊపిరి పీల్చుకున్నారు బాలయ్య ఫ్యాన్స్.

ఒకవేళ అమితాబ్ ఓకే అని ఉంటే.. బాలయ్య ‘రైతు’ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని ఆలోచించి అమితాబ్ నో చెప్పడం మంచికే అయిందని కూడా నందమూరి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఐతే బాలయ్యకు నో అని చిరుకు ఓకే చెప్పడం మాత్రం వాళ్ల ఇగోను కొంతమేర దెబ్బ తీసిందన్నది కూడా వాస్తవమే.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు