ధనుష్ కన్నా అజిత్ మేలు..

ధనుష్ కన్నా అజిత్ మేలు..

తమిళంలో ధనుష్‌తో పోలిస్తే అజితే పెద్ద స్టార్. అతడి మార్కెట్లో ధనుష్ మార్కెట్ సగం కూడా ఉండదు. ఐతే తెలుగు విషయానికొస్తే.. అజిత్ కంటే ధనుష్‌కే కొంచెం క్రేజ్ ఎక్కువ. ‘రఘువన్ బీటెక్’ సినిమాతో తెలుగులో మంచి ఫాలోయింగే సంపాదించుకున్నాడు. ఆ సినిమా థియేటర్లలోనే కాక టీవీల్లోనూ చాలా బాగా ఆడేసి మన ప్రేక్షకుల్లో అతడికి మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.

‘రఘువరన్ బీటెక్’కు సీక్వెల్ మొదలుపెట్టాడని తెలియగానే మన ప్రేక్షకులకు కూడా దానిపై ఆసక్తి నెలకొంది. ఓ దశలో ఈ సినిమాకు మంచి బిజినెస్ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ మరీ ఎక్కువ రేటు ఆశించడం వల్ల... తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి విడుదల చేయకపోవడం వల్ల ‘వీఐపీ-2’ విషయంలో అసలుకే మోసం వచ్చింది.

తమిళంలో విడుదలైన రెండు వారాలకు తెలుగులో రిలీజ్ చేస్తుండటం.. తమిళంలో డివైడ్ టాక్ రావడం తెలుగు వెర్షన్‌కు చేటు చేశాయి. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఏమాత్రం క్రేజ్ కనిపించడం లేదు. శుక్రవారం విడుదలవుతున్న ‘అర్జున్ రెడ్డి’ మీదే అందరి ఫోకస్ ఉంది. ‘వీఐపీ-2’కు బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి. దాంతో పోలిస్తే అజిత్ సినిమా ‘వివేకం’ పరిస్థితే మెరుగ్గా ఉంది. గురువారం విడుదలవుతున్న ఈ సినిమాకు ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. దీనికి తొలి రోజు మంచి వసూళ్లే వచ్చేలా కనిపిస్తున్నాయి.

దీని టాక్.. ‘అర్జున్ రెడ్డి’ టాక్ ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి తర్వాత వసూళ్లు ఆధారపడి ఉంటాయి. అజిత్‌కు తెలుగులో మార్కెట్ ఏమీ లేకపోయినా.. ఈ సినిమాను తెలుగులో పెద్దగా ప్రమోట్ చేసింది కూడా లేకపోయినా.. ‘వీఐపీ-2’తో పోలిస్తే హైప్ అయినా.. వసూళ్లయినా మెరుగ్గానే ఉండటం విశేషమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు