ఖాన్ త్ర‌యంపై అమీర్ షాకింగ్ కామెంట్స్‌!

ఖాన్ త్ర‌యంపై అమీర్ షాకింగ్ కామెంట్స్‌!

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో అమీర్ ఖాన్‌, షారుక్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్ ల‌కు విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. ఈ ఖాన్ త్ర‌యం 20 ఏళ్లుగా బాలీవుడ్ లో తిరుగులేని ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌మ సినిమాల‌తో బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నారు. అటువంటి ఖాన్ త్ర‌యంపై మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్  అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

బాలీవుడ్ లో స్టార్స్ చాలామంది ఉన్నార‌ని, ఆ స్టార్ స్టేట‌స్ ను కేవ‌లం ఖాన్ త్ర‌యానికి క‌ట్ట‌బెట్ట‌డం స‌రికాదని చెబుతున్నాడు అమీర్ ఖాన్‌. బాలీవుడ్ లో చాలామంది ప్ర‌తిభావంతులైన న‌టీన‌టులున్నార‌ని, వారంద‌రికీ స్టార్ డ్ర‌మ్ వ‌ర్తిస్తుంద‌ని చెప్పాడు.

‘‘ఇండస్ట్రీలో చాలామంది టాలెంటెడ్ అండ్ పాపులర్ స్టార్లున్నారు. స్టార్ డమ్ విష‌యంలో ఖాన్ లతో పాటు వారినీ ప‌రిగ‌ణించాలి. హీరో అక్షయ్ కుమార్ పాపులారిటీకి ఏం తక్కువ? అక్ష‌య్ కుమార్‌ లేటెస్ట్ సినిమా టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి వ‌సూళ్లు రాబట్టింది. స్టార్ డమ్ ను కేవ‌లం ముగ్గురు ఖాన్ లకు పరిమితం చేయకూడ‌దు’’ అంటూ అమీర్ ఖాన్ తెగేసి చెప్పేశాడు.

తాజాగా విడుద‌లైన షారూఖ్ - సల్మాన్ సినిమాలు జబ్ హ్యారీ మెట్ సెజల్.. ట్యూబ్ లైట్ ఘోర ప‌రాజ‌యం పాల‌య్యాయ‌ని, ఆ సినిమాల‌కు ఖాన్ ల స్టార్ మ్యాజిక్  ప‌నిచేయ‌లేద‌ని అమీర్ అన్నాడు. మన ప్రయత్నాలలో సక్సెస్అ, ఫెయిల్యూర్ లు స‌హ‌జ‌మ‌ని, మన పని కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్లడమే ముఖ్యమ‌ని అమీర్ చెప్పాడు. ప్రస్తుతం అమీర్ ఖాన్ తన అప్ క‌మింగ్ మూవీ సీక్రెట్ సూపర్ స్టార్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నసంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English