సెప్టెంబ‌రు 3 న జై ల‌వ కుశ ఆడియో!

సెప్టెంబ‌రు 3 న జై ల‌వ కుశ ఆడియో!

బాబీ ద‌ర్శ‌క‌త్వంతో జూ.ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న జై ల‌వ‌కుశ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఆ చిత్రంలో జై పాత్ర టీజ‌ర్ కు మంచి స్పంద న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.  'వినాయక చవితి'కి 'లవ' టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. సెప్టెంబర్ 21న సినిమా విడుద‌ల కాబోతోంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ ఈ చిత్రంలోని పాట‌ల‌ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జై ల‌వ కుశ ఆడియో ఫంక్ష‌న్ ను సెప్టెంబ‌రు 3న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది.  

జై లవకుశ టీజర్ కు దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నందమూరి హరికృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ సినిమా ఆడియోను రిలీజ్ చేద్దామ‌నుకున్నారట‌. అయితే, అదే రోజు ఎన్టీఆర్ కు బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఉండ‌డంతో  సెప్టెంబర్ 3న రిలీజ్ చేస్తున్నారట. ఎన్టీఆర్ ఈవెంట్లకు హరికృష్ణ, క‌ళ్యాణ్ రామ్ లు ప్ర‌త్యేక అతిథులుగా వ‌స్తున్నారు. ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ నిర్మాత కావ‌డంతో, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజమౌళి ఈ ఆడియో ఫంక్ష‌న్ కు ముఖ్య అతిథిగా రాబోతున్నార‌ట‌. ఎన్టీర్ , రాజ‌మౌళికి ప్ర‌త్యేక అనుంఢం ఉండ‌డం కూడా ఇందుకు కార‌ణ‌మట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు