అన్నీ 'బాహుబలి' స్థాయిలోనే...

అన్నీ 'బాహుబలి' స్థాయిలోనే...

‘బాహుబలి’ తర్వాత మన రీజనల్ ఫిలిం మేకర్స్‌కు చలా ధైర్యం వచ్చింది. వందల కోట్ల బడ్జెట్‌తో భారీ తారాగణం, సాంకేతిక నిపుణులతో ప్రపంచ స్థాయి సినిమాలు తీయడానికి చాలామంది ముందుకొస్తున్నారు. తమిళంలో ‘2.0’ ఏకంగా రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు చాలామంది పని చేస్తున్నారు.

అలాగే సుందర్.సి ‘సంఘమిత్ర’ లాంటి భారీ సినిమాను నెత్తికెత్తుకున్నాడు. ఈ సినిమాకు కూడా ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రం ‘సాహో’కు కూడా ఇంటర్నేషనల్ టెక్నీషియన్ల ఆకర్షణగా నిలవబోతున్నారు. ఇప్పుడు తెలుగులో తెరకెక్కుతున్న ‘సైరా.. నరసింహారెడ్డి’ కూడా భారీ స్థాయిలోనే తెరకెక్కతోంది. ‘బాహుబలి’ తర్వాత తెలుగులో తెరకెక్కబోయే అతి పెద్ద బడ్జెట్ సినిమా ఇదే. ‘సైరా..’కు రూ.150 కోట్ల పైనే ఖర్చు పెట్టనున్నట్లు సమాచారం.

ఎ.ఆర్.రెహమాన్, రాజీవన్ లాంటి ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు హాలీవుడ్ టెక్నీషియన్ల సాయం కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. పలు అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ స్టూడియోల భాగస్వామ్యంతో ఈ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తారట. అలాగే యాక్షన్ డైరెక్టర్‌గా కూడా హాలీవుడ్ టెక్నీషియన్‌ను తీసుకొస్తున్నారు.

‘స్పైడర్ మ్యాన్’ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించిన టోనీ చింగ్ ‘సైరా..’కు పని చేయబోతున్నట్లు సమాచారం. ఇంకా మరింత మంది అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తారని సమాచారం. తారాగణం, టెక్నీషియన్లకే సగం బడ్జెట్ పక్కన పెట్టినట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English