విడుద‌ల‌కు ముందే 'భ‌ర‌త్' కు భారీ క్రేజ్‌!

విడుద‌ల‌కు ముందే 'భ‌ర‌త్' కు భారీ క్రేజ్‌!

ఒక‌ప్పుడు ద‌క్షిణాది సినిమాలు ఉత్త‌రాదిలో చాలా అరుదుగా డ‌బ్, రీమేక్‌ అయ్యేవి. అయితే, కొంత కాలంగా సౌత్ లో హిట్ మూవీస్ ని హిందీలో డబ్, రీమేక్ చేయ‌డం ప్రారంభించారు. అయితే, బాహుబ‌లి చిత్రం త‌ర్వాత ఆ జోరు మ‌రింత పెరిగింది. ఈ సినిమా ప్ర‌భావంతో తెలుగులోని స్టార్ హీరోల సినిమాలకు బాలీవుడ్ మార్కెట్ లో కూడా క్రేజ్ ఏర్పడింది. దీంతో నిర్మాణ ద‌శ‌లో ఉన్న‌పుడే ఆ తెలుగు స్టార్ హీరోల సినిమాల కాపీ రైట్స్ కోసం నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు.

ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న స్పైడ‌ర్ సినిమాకు హిందీ రైట్స్ కు భారీ ధ‌ర ప‌లికిన సంగ‌తి తెలిసిందే. అంత‌క‌ముందు బాలీవుడ్ లో  మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గ‌జినీ, హాలిడే, అకీరా చిత్రాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. దీంతో మురుగ‌దాస్ కు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. దీంతో, బాలీవుడ్ లో స్పైడర్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయింది.

అదే ఊపులో, ప్రిన్స్ హీరోగా కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ''భరత్ అను నేను'' సినిమా డబ్బింగ్ రైట్స్ 16 కోట్లకు కొనేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ తెలుగు హీరోకు ఆ క్రెడిట్ ద‌క్క‌క‌పోవ‌డం విశేషం.  సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్ర‌లో న‌టిస్తున్నాడు. శ్రీ‌మంతుడు వంటి సందేశాత్మ‌క చిత్రాన్ని తీసిన శివ ఈసారి పొలిటిక‌ల్ జాన‌ర్ ను ఎంచుకున్నాడు. మ‌రి ఈ సినిమా కూడా శ్రీ‌మంతుడు త‌ర‌హాలో భారీ హిట్ అవుతుందేమో చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు