నరసింహారెడ్డి కోసం సేతుపతి చేసేదేంటి?

నరసింహారెడ్డి కోసం సేతుపతి చేసేదేంటి?

తమిళ చిత్ర సీమలో విజయ్‌ సేతుపతి చాలా బిజీ హీరో. మీడియం రేంజ్‌ సినిమాలతో వరుస విజయాలు సాధించే విజయ్‌ సేతుపతి అక్కడి స్టార్‌ హీరోల చిత్రాల్లో కూడా సపోర్టింగ్‌ రోల్స్‌ చేయడానికి ఇష్టపడడు. కానీ 'సైరా నరసింహారెడ్డి' కోసం అతనికి భారీ పారితోషికం ఆఫర్‌ చేసి ఒప్పించినట్టు సమాచారం. హీరోగా పెద్ద ఇమేజ్‌ వున్న విజయ్‌ సేతుపతితో క్యారెక్టర్‌ చేయిస్తున్నారంటే అది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్‌ అయి వుండాలి.

ఇంతకీ 'సైరా'లో సేతుపతి చేసేదేంటి? ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి బ్రిటిష్‌ అంగరక్షకుడిగా నెగెటివ్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'కి వ్యతిరేకంగా నిలిచి ఆ తర్వాత అతడికి సపోర్ట్‌ ఇచ్చే పాత్రలో విజయ్‌ సేతుపతి కనిపిస్తాడట.

కథలో ఈ పాత్ర చాలా కీలకమని, ఈ పాత్రకి పేరున్న నటుడు అవసరమని, అయితే రెగ్యులర్‌ యాక్టర్స్‌ కాకుండా ఎవరైనా పాపులర్‌ యాక్టర్‌ అయితే బాగుంటుందని ఆలోచించి చివరకు విజయ్‌ సేతుపతిని ఫైనలైజ్‌ చేసారట. ఇతను ఈ చిత్రంలో నటిస్తున్నాడని తెలియడంతో ఒక్కసారిగా తమిళ మీడియాతో పాటు అక్కడి జనాలు కూడా సైరాపై ఆసక్తి చూపిస్తున్నారు.

విజయ్‌ సేతుపతి కథల ఎంపికలో ఎంత ఖచ్చితంగా వుంటాడో, ఒక పాత్ర అంగీకరించే ముందు ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తాడో తెలుసు కనుకే ఇది స్పెషల్‌ సినిమా అని కోలీవుడ్‌ సర్కిల్స్‌ నమ్ముతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు