చిరు అయినా, బాలయ్య అయినా ఆమెకి లెక్క లేదు

చిరు అయినా, బాలయ్య అయినా ఆమెకి లెక్క లేదు

ఎప్పుడో పెళ్లి చేసుకుని వెళ్లిపోవాలని అనుకున్న నయనతార ఇప్పటికీ అగ్ర తారగా వెలుగొందుతూనే వుంది. తమిళ చిత్ర సీమలో స్టార్‌ స్టేటస్‌ అనుభవిస్తోన్న నయనతారకి టాలీవుడ్‌లోను డిమాండ్‌ బాగుంది. ముఖ్యంగా అరవయ్యేళ్లు దాటిన హీరోల పక్కన కూడా సూట్‌ అయ్యే హీరోయిన్‌ కావడంతో నయనతార పంట పండుతోంది.

ఆ ఏజ్‌ గ్రూప్‌ హీరోల కోసం ఎక్కువ ఆప్షన్లు లేకపోయేసరికి ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు వెనుకాడడం లేదు. ఇతర హీరోయిన్లు తీసుకునే దానికి నయనతార డబుల్‌ ఛార్జ్‌ చేయడంతో పాటు ప్రమోషన్స్‌కి రానని తెగేసి చెబుతోందట. హీరో ఎవరైనా కానీ తన కండిషన్లు మారవని స్టార్లని సైతం లెక్క చేయడం లేదట.

ఆమె ఎన్ని షరతులు పెట్టినా, ఎన్ని గొంతెమ్మ కోర్కెలు కోరినా కానీ మరో ఆప్షన్‌ లేకపోవడంతో చెల్లిపోతోంది. బాలకృష్ణ, చిరంజీవి తదుపరి చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తోన్న నయనతారకి తమిళంలో అరడజను సినిమాలున్నాయి.

దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో ప్రేమలో వున్న నయనతార అతడితో పెళ్లిని కూడా వాయిదా వేస్తూ ఇప్పుడు తనకున్న డిమాండ్‌ని ఫుల్‌గా క్యాష్‌ చేసుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు