సైరా గురించి నోరు మెదపడేంటి?

సైరా గురించి నోరు మెదపడేంటి?

సైరా నరసింహారెడ్డి చిత్రంలో అమితాబ్‌తో పాటు సుదీప్‌, విజయ్‌ సేతుపతి లాంటి ఆర్టిస్టులని పెట్టడంతో అన్ని భాషలు కవర్‌ అయ్యాయని, పాన్‌ ఇండియా అప్పీల్‌ వచ్చిందని అభిమానులు సంబరపడుతున్నారు. అయితే ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ రిలీజ్‌కి అమితాబ్‌తో పాటు ఇతర ఆర్టిస్టులంతా మౌన ముద్ర వహించడం షాకింగ్‌గా వుంది.

ప్రతి విషయం గురించి ట్వీట్లేస్తూ బిజీగా వుండే అమితాబ్‌ కనీసం ఈ చిత్రం పోస్టర్స్‌ గురించి ఏదైనా కామెంట్‌ చేయడం అటుంచి, రీట్వీట్‌ కూడా చేయలేదు. నిన్న అసలు ట్విట్టర్‌కి రాలేదా అంటే అదేమీ లేదు. ఏవో రెండు ట్వీట్లు కూడా వేసి వెళ్లాడు. నేషనల్‌ వైడ్‌గా ట్రెండ్‌ అయిన సైరా నరసింహారెడ్డి సంగతి ఆయన దృష్టికి వెళ్లలేదని అనుకోవడానికి లేదు.

ఎందుకంటే చాలా మంది ఆయన హ్యాండిల్‌ని ట్యాగ్‌ చేస్తూనే ట్వీట్లు వేసారు. పెద్ద సెలబ్రిటీలు కూడా దీని గురించే మాట్లాడారు. అయినా కానీ అమితాబ్‌ మాత్రం తనకేమీ పట్టనట్టు వుండిపోయాడు. ఈ చిత్రానికి జాతీయ వ్యాప్తంగా ఆకర్షణ తీసుకొస్తాడనే ఆశతోనే బిగ్‌ బీని ఏరి కోరి ఇందులో పెట్టుకున్నారు.

కానీ అమితాబ్‌ మాత్రం అదేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడు. బాహుబలి 2 అంతటి ఘన విజయం సాధించినపుడు కూడా బాలీవుడ్‌ స్టార్లు దాని గురించి మాట్లాడేందుకు చాలా సమయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా పురోగతి చూసి వీరికి కన్ను కుడుతోందో ఏమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు