వైర‌ల్‌ ఫొటో: 'ఆమె నీ కూతురేనా?'

వైర‌ల్‌ ఫొటో: 'ఆమె నీ కూతురేనా?'

ఈ మ‌ధ్య బాలీవుడ్ లో సెల‌బ్రిటీల కూతుళ్లు త‌మ ఫొటో అప్ డేట్స్ తో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. అల‌నాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్న‌వి, హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ త్వ‌ర‌లో తెరంగేట్రం చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో, వారి హాట్ ఫొటోల‌తో  ఎప్ప‌టిక‌పుడు మీడియా, సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. అదే బాట‌లో మ‌రో బాలీవుడ్ న‌టుడి కూతురి క్యూట్ ఫొటో సోష‌ల్ మీడియాలో అప్ డేట్ అయింది. ఆ ఫొటో ఇపుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయింది.

బాలీవుడ్‌ నటుడు చుంకీ పాండే కూతురు అనన్య (18) ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అనన్య ఫొటోను ఆమె తల్లి భావన పాండే  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అప్ లోడ్ అయిన కొద్ది సేప‌టికే ఆ  ఫొటో వైరల్‌గా మారింది. బాలీవుడ్ కు అనన్య రూపంలో మ‌రో హీరోయిన్ దొరికిందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ పెట్టారు. ఆ ఫొటోపై కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కురాలు ఫ‌రాహ్ ఖాన్ ఓ షాకింగ్ కామెంట్ చేసింది.  'దయ చేసి డీఎన్‌ఏ పరీక్ష చేయించండి. తను చుంకీ కూతురంటే నమ్మలేం. చాలా లవ్లీగా ఉంది' అంటూ లాఫ్టర్ ఎమోజీతో ఫ‌రాహ్ కామెంట్ చేసింది. అన‌న్య‌ను సరదాగా ఆటపట్టించేందుకు ఆమె పెట్టిన ఈ కామెంట్‌  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయింది. ఆ క్యూట్‌ ఫొటోకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1700లకుపైగా లైకులు వచ్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English