‘వీడెవడు’ మధ్య లో దూరాడు

‘వీడెవడు’ మధ్య లో దూరాడు

చైతూతో యుద్ధానికి ఇంకొకడు

సెప్టెంబరు 1న నందమూరి బాలకృష్ణ సినిమా ‘పైసా వసూల్’ వస్తున్నా సరే.. తర్వాతి వీకెండ్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ లో గట్టి పోటీ నెలకొనబోతోంది. సెప్టెంబరు 8వ తేదీ కోసం అంతకంతకూ పోటీ పెరిగిపోతోంది. ముందుగా ఆ తేదీకి నారా రోహిత్ సినిమా ‘బాలకృష్ణుడు’ రిలీజ్ అనుకున్నారు. కానీ ‘పైసా వసూల్’ సెప్టెంబరు 1కి ప్రి పోన్ కావడం.. రోహిత్ మరో సినిమా ‘కథలో రాజకుమారి’ వాయిదా పడుతూ రావడంతో ఆ సినిమా వెనక్కి వెళ్లిపోయింది. అంతలో మంచు మనోజ్ సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ బెర్తు బుక్ చేసుకుంది. సెప్టెంబరు 8న రిలీజ్ పక్కాగా ఫిక్స్ చేసుకున్న తొలి సినిమా అది. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య రేసులోకి వచ్చాడు.

ఆగస్టు 25కే అనుకున్న ‘యుద్ధం శరణం’ సినిమాను రెండు వారాలు వాయిదా వేసి సెప్టెంబరు 8కి ఫిక్స్ చేశారు. దీంతో ఆ రోజు ఫస్ట్ ఛాయిస్ గా మారిందీ సినిమా. రెండు సినిమాలు 8వ తేదీకి ఖరారైనప్పటికీ అల్లరి నరేష్ సినిమా ‘మేడ మీద అబ్బాయి’ని అదే డేటుకు కన్ఫమ్ చేశారు. ఈ చిత్ర నిర్మాత కూడా సెప్టెంబరు 8న రిలీజ్ అనే పబ్లిసిటీ చేస్తున్నాడు. ఇప్పటికైతే పై మూడు సినిమాల విడుదల విషయంలో ఎలాంటి మార్పుల్లేవు.

ఒక రోజు మూడు సినిమాలే ఎక్కువ అనుకుంటుంటే.. అల్లరి నరేషే రిస్క్ చేస్తున్నాడని భావిస్తుంటే.. ఇప్పుడు ముంబయి బుల్లోడు సచిన్ జోషి లైన్లోకి వచ్చాడు. అతను హీరోగా నటించిన ‘వీడెవడు’ సినిమాను కూడా సెప్టెంబరు 8నే రిలీజ్ చేస్తామని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా ఒకే తేదీన రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో సెప్టెంబరు 8 విషయంలో తగ్గేట్లు లేరు. మరి ఇప్పటికే క్రౌడ్ ఎక్కువైందనుకుంటుంటే.. సచిన్ వచ్చి ఏం చేస్తాడు? ఇంత పోటీ మధ్య అతడి సినిమాను ఎవరు పట్టించుకుంటారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు