పెళ్లిచూపులు హీరోకి గైడెన్స్‌ లేదు

పెళ్లిచూపులు హీరోకి గైడెన్స్‌ లేదు

యంగ్‌ ఏజ్‌లో సక్సెస్‌ వచ్చినపుడు ఒక్కొక్కరూ ఒక్కో తీరున రియాక్ట్‌ అవుతుంటారు. దుడుకు స్వభావం వున్న వాళ్లకి సక్సెస్‌ని తలకెక్కకుండా హ్యాండిల్‌ చేయడం కాస్త కష్టమైన విషయమే. స్వతహాగా దూకుడు స్వభావి అయిన విజయ్‌ దేవరకొండకి సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఏమీ లేదు. బయటి నుంచి వచ్చి అనుకోకుండా పెళ్లిచూపులుతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. దాంతో యువతలో క్రేజ్‌ వచ్చింది.

అర్జున్‌ రెడ్డి టీజర్‌ విప్లవాత్మకంగా వుండడంతో యువత దీనికి కూడా బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో విజయ్‌ దేవరకొండ ఎక్సయిట్‌మెంట్‌లో తానొక హీరోనని, తన మాటలు జనాన్ని ప్రభావితం చేస్తాయని విస్మరించి ఫిల్టర్‌ లేకుండా మాట్లాడేస్తున్నాడు. రాజకీయ నాయకులపై సెటైర్లు వేయడానికి తోడు సెన్సార్‌ బోర్డు మీద కూడా విసుర్లతో విజయ్‌ తన అపరిపక్వత చాటుకున్నాడు. పబ్లిక్‌ ఫంక్షన్‌లో పచ్చి బూతులు మాట్లాడడమే కాకుండా యువకులతో బూతులు మాట్లాడించి హాట్‌ టాపిక్‌ అయ్యాడు. పెళ్లిచూపులు విజయంతో కొత్త కుర్రాడు వచ్చాడని, ప్రతిభావంతుడని మెచ్చుకున్న వాళ్లే ఇప్పుడతని మాటలు విని సరైన గైడెన్స్‌ లేనట్టుందని అనేస్తున్నారు. ఒక సెలబ్రిటీ పబ్లిక్‌ ఇమేజ్‌ అనేది ఎప్పుడూ క్లీన్‌గా వుండాలి.

ఏవో ఈలలు, చప్పట్ల కోసం పాకులాడి నోటికొచ్చింది మాట్లాడితే రేపు ఫెయిల్యూర్‌ వచ్చినపుడు ఇవన్నీ ప్రతిబంధకాలుగా మారి కెరియర్‌ని ఇబ్బందుల్లోకి నెడతాయి. భారీ విజయాలు చవిచూసి నాలుగు సినిమాల తర్వాత కనుమరుగైపోయిన హీరోలు చాలా మందే వున్నారని అతను గుర్తుంచుకుని పబ్లిక్‌ ఇమేజ్‌ పట్ల, మీడియాతో ఇంటరాక్షన్‌ పట్ల కేర్‌ఫుల్‌గా వుండాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు