చిరంజీవిని పర్సనల్‌గా కలిసిన పవన్‌

చిరంజీవిని పర్సనల్‌గా కలిసిన పవన్‌

చిరంజీవి సినిమా వేడుకలకి గైర్హాజరవుతోన్న పవన్‌ కళ్యాణ్‌ ప్రైవేట్‌గా మాత్రం అన్నయ్యని కలుస్తూనే వున్నాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్‌ ఇంటికి వెళ్లి శుభాకారక్షలు తెలిపి, అన్న, వదినలతో కాసేపు ముచ్చటించి వచ్చాడని ఇండస్ట్రీ సమాచారం. 'సైరా నరసింహారెడ్డి' లోగో లాంఛ్‌కి పవన్‌ని చరణ్‌ ఆహ్వానించినా కానీ ఏదో కారణం చెప్పి వెళ్లలేదట.

అయితే పుట్టినరోజు నాడు అన్నయ్యని స్వయంగా కలిసి విషెస్‌ అందించాడు. సైరా వేడుకకి చిరంజీవి కూడా రాకపోవడం అభిమానుల్ని కాస్త నిరాశ పరిచింది. చిరంజీవి షష్టి పూర్తి వేడుకల తర్వాత మళ్లీ చిరంజీవిని పవన్‌ పబ్లిక్‌గా కలవలేదు. పబ్లిక్‌గా కలవకపోయినా కానీ పర్సనల్‌గా అన్నదమ్ములు కలుస్తూనే వున్నారని వార్తలు వస్తూనే వున్నాయి. చిరంజీవి చేస్తోన్న సైరా నరసింహారెడ్డి విశేషాలని పవన్‌ అడిగి తెలుసుకున్నాడని, వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రణాళిక, కార్యాచరణ ఏమిటనేది చిరంజీవి చర్చించారని సమాచారం.

ఇదిలావుంటే సైరా నరసింహారెడ్డి మోషన్‌ పోస్టర్‌కి అన్ని వైపుల నుంచి వస్తోన్న పాజిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌తో మెగా కాంపౌండ్‌లో పండగ వాతావరణం నెలకొంది. ఈ చిత్రానికి ఆది నుంచే హైప్‌ తీసుకురావాలనే ప్లాన్‌ సూపర్‌గా వర్కవుట్‌ అవడంతో టీమ్‌ సంబరాల్లో మునిగిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English