చిరు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు

చిరు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు

మొత్తానికి చిరంజీవి కొత్త సినిమా సంగతులూ పూర్తిగా బయటికి వచ్చేశాయి. ‘సైరా’ అనే టైటిల్.. దానికి ‘నరసింహారెడ్డి’ అనే ట్యాగ్ లైన్ పెట్టి.. ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ ఎవరో వెల్లడించింది చిత్ర బృందం. దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ లాంచ్ ఘనంగా లాంచ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ కూడా మంచి రెస్పాన్సే తెచ్చుకుంది. చిరంజీవి లుక్‌ను పూర్తి స్థాయిలో చూపించకుండా వెనుక నుంచి గ్లింప్స్ చూపించి అభిమానుల్ని ఊరించారు. షూటింగ్ మొదలై కొన్నాళ్లు గడిచాక మంచి ముహూర్తం చూసుకుని ఏ సంక్రాంతి టైంలో ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

‘సైరా..’ మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉందనడంలో సందేహం లేదు. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో తనదైన స్థానం సంపాదించున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు ఎలా ఇమిడిపోతాడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. చిరు లుక్ ఎలా ఉంటుందన్నది ఇప్పటికే జనాలకు ఓ ఐడియా వచ్చేసింది. లుక్ పరంగానే కాక.. తన నటనతోనూ చిరు ఉయ్యాలవాడ పాత్రలో మెప్పిస్తాడనంలో సందేహాలేమీ లేవు. కానీ ఒక్క విషయంలో మాత్రం జనాలకు తేడా కొడుతూ ఉంది. అదే.. చిరంజీవి వాయిస్. దాదాపు దశాబ్దం పాటు సినిమాల నుంచి విరామం తీసుకుని ‘ఖైదీ నెంబర్ 150’ చేసిన చిరు.. అందులో అన్ని రకాలుగా మెప్పించాడు కానీ.. వాయిస్ మాత్రం తేడా కొట్టేసింది. కొంచెం ఆవేశంతో పంచ్ డైలాగులు చెప్పినపుడల్లా అదోలా అనిపించింది.

‘‘పొగరు నా ఒంట్లో ఒంటది. హీరోయిజం నా ఇంట్లో ఉంటది.. వెయిటింగ్’’ అనే డైలాగ్ సంగతే తీసుకుంటే అందులో ఫోర్స్ మిస్సవడాన్ని గమనించవచ్చు. మరి ఉయ్యాలవాడ లాంటి పౌరుషం ఉన్న స్వాతంత్ర్య సమర యోధుడి పాత్ర అంటే.. డైలాగులు చాలా కీలకం అవుతాయి. మాటల్లో పౌరుషం చూపించాల్సి ఉంటుంది. ఒక బిగి.. ఒక ఫోర్స్ అవసరమవుతాయి. మరి చిరు వాయిస్ అందుకు తగ్గట్లుగా ఉంటుందా అన్నది డౌటు. ఈ విషయంలో ఆయన కొన్ని ఎక్సర్‌సైజులు.. ఎక్స్‌పరిమెంట్లు చేసి వాయిస్ తేడా రాకుండా చూసుకుంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి చిరు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు