మెగా ఫీల్డింగ్‌ మామూలుగా లేదుగా!

మెగా ఫీల్డింగ్‌ మామూలుగా లేదుగా!

బాహుబలి చిత్రాన్ని ఉత్తరాది ఆర్టిస్టులు లేకుండానే అక్కడి వారికి దగ్గర చేసాడు రాజమౌళి. అయితే అన్ని సినిమాలకీ అది కుదిరే పని కాదు కనుక పక్క రాష్ట్రాలకి, జాతీయ వ్యాప్త గుర్తింపుకి ఒక ప్రాంతీయ చిత్రం నోచుకోవాలంటే అందుకు తగ్గ సెట్టింగ్‌ వుండాలి. అందుకే ఉత్తరాదిని కవర్‌ చేయడానికి అమితాబ్‌ని, తమిళనాడుని కవర్‌ చేయడానికి విజయ్‌ సేతుపతిని, కర్నాటక కోసం సుదీప్‌ని ముఖ్య పాత్రల్లో తీసుకున్నారు. అలాగే నయనతార హీరోయిన్‌ కనుక సౌత్‌ మొత్తం ఆమె కవర్‌ చేసేస్తుంది.

ఐశ్వర్యారాయ్‌ కూడా నటిస్తుందని అంటున్నారు కనుక బాలీవుడ్‌ అప్పీల్‌కి ఆమె కూడా ప్లస్‌ అవుతుంది. ఇక టెక్నికల్‌ టీమ్‌ విషయంలో కూడా ఏమాత్రం రాజీ పడలేదు. రెహమాన్‌, రాజీవన్‌, రవి వర్మన్‌ పేర్లతోనే పోస్టర్‌కి ఒక కళ వచ్చేసింది. బడ్జెట్‌, కాస్టింగ్‌, క్రూ పరంగా మెగా ఫీల్డింగ్‌ భేషుగ్గా కుదిరింది. ఈ చిత్రాన్ని మెగా ఫ్యామిలీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే దానికి ఇది ఉదాహరణ. నిర్మాణ వ్యయ పరంగా ఏమాత్రం రాజీ పడరాదని, తన తండ్రి కెరియర్లో ఇదొక మైలురాయిగా మిగిలిపోవాలని రామ్‌ చరణ్‌ దీని కోసం చాలా రిస్క్‌ చేస్తున్నాడు.

సైరా నరసింహారెడ్డి పేరు విన్నపుడు అదోలా అనిపించినా కానీ మోషన్‌ పోస్టర్‌, టైటిల్‌ డిజైన్‌ బయటకి వచ్చేసరికి దీనిపై పూర్తి పాజిటివ్‌ వైబ్స్‌ సెట్‌ అయ్యాయి. ప్రమోషన్‌ పరంగా కూడా ఈ చిత్రానికి ఎలాంటి రాజీ పడరాదని దాని కోసమే కొన్ని కోట్లు ప్రత్యేకంగా కేటాయించారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English