హలో తర్వాత హలో బ్రదరేనా?

హలో తర్వాత హలో బ్రదరేనా?

మొదటి సినిమా అఖిల్‌ ఫ్లాప్‌ అయినా, రెండవ సినిమాతో 'హలో' సక్సెస్‌ఫుల్‌గా చెబుతాననే కాన్ఫిడెన్స్‌తో వున్నాడు అఖిల్‌ అక్కినేని. నాగార్జున నమ్మకం చూస్తున్నా ఈ చిత్రంపై అక్కినేని క్యాంప్‌కి పూర్తి భరోసా వుందని అర్థమవుతోంది. రెండవ సినిమాతో యాక్షన్‌ హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటు రొమాన్స్‌లో తండ్రికి తగ్గవాడని అనిపించుకోవడానికి అఖిల్‌ ప్రయత్నిస్తున్నాడు.

దీని తర్వాత అఖిల్‌ చేసే సినిమాల్లో 'హలో బ్రదర్‌' రీమేక్‌ వుంటుందనే గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని నాగచైతన్యతో రీమేక్‌ చేయాలని అప్పట్లో ప్రయత్నాలు జరిగాయి కానీ ఎందుకో కుదర్లేదు. మళ్లీ ఇప్పుడు అఖిల్‌తో ఆ ప్రాజెక్ట్‌ వుండవచ్చునని అంటున్నారు. నాగ్‌ సినిమాల్లో ఏదైనా రీమేక్‌ చేయాల్సి వస్తే హలో బ్రదరే చేయాలని అఖిల్‌ కూడా అభిలషిస్తున్నాడట.

ఎలాగో హిందీలో హలో బ్రదర్‌కి రీమేక్‌ అయిన జుడ్వాని మళ్లీ వరుణ్‌ ధవన్‌తో రీమేక్‌ చేస్తున్నారు కనుక తెలుగులో కూడా ఆ ఎవర్‌గ్రీన్‌ కామెడీని మళ్లీ రీవిజిట్‌ చేస్తే ఎలాగుంటుందని యోచిస్తున్నారట. నాగార్జున కూడా హలో బ్రదర్‌ రీమేక్‌ పట్ల సుముఖంగానే వున్నారని, ఇప్పటి ట్రెండుకి తగ్గట్టు కాంటెంపరరీ కామెడీతో దానిని వినోదాత్మకంగా మలిచేందుకు ఎవరైనా ముందుకు వస్తే అన్నపూర్ణ సంస్థలోనే చేయడానికి నాగ్‌ సంసిద్ధమట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English