'సైరా' స్కేల్‌ అదిరింది, సేల్‌ అవుతుందా?

'సైరా' స్కేల్‌ అదిరింది, సేల్‌ అవుతుందా?

మెగాస్టార్‌ చిరంజీవి చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమవుతోంది. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథతో సినిమా చేయాలని ఆయన ఎన్నో ఏళ్లుగా తపిస్తున్నారు. రామ్‌ చరణ్‌ ఇప్పుడా కలని నిజం చేసే పనిలో పడ్డాడు. ఏదో ఆషామాషీగా కాకుండా ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అందుకే అమితాబ్‌ బచ్చన్‌ని కీలక పాత్రకి ఎంచుకున్నారు.

అలాగే సుప్రసిద్ధులు ఈ చిత్రానికి సాంకేతిక విభాగంలో పని చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రెహమాన్‌ సంగీతాన్ని, రవివర్మన్‌ ఛాయాగ్రహణాన్ని సమకూరుస్తున్నారు. రాజీవన్‌ కళా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రచన పరుచూరి సోదరులు చేస్తున్నారు. ఈ చిత్రం ఏ స్థాయిలో వుండబోతుందనే దానికి హింట్‌ ఇస్తున్నట్టుగా మోషన్‌ పోస్టర్‌లోనే ఒక ఐడియా ఇచ్చారు.

దాదాపు రెండు వందల కోట్ల వ్యయంతో, భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం స్కేల్‌ పరంగా 'బాహుబలి' తర్వాతి స్థానాన్ని అందుకోనుంది. అయితే అదే స్థాయిలో జాతీయ వ్యాప్తంగా సేల్‌ అవుతుందా అన్నదే అభిమానుల మెదళ్లు తొలిచేస్తుంది. చిరంజీవి చిత్రానికి తెలుగు రాష్ట్రాలు, కర్నాటకలో ఎలాంటి లోటు వుండదు.

కానీ ఈ చిత్రాన్ని ఉత్తర భారతంతో పాటు మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోను సేల్‌ చేయాలని చూస్తున్నారు. అందుకు తగ్గ హంగులతో, వారిని ఆకర్షించే అంశాలతో రావడం 'సైరా నరసింహారెడ్డి' టీమ్‌కి పెద్ద టార్గెట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English