చిన్న సినిమా దంచి కొడుతోంది

చిన్న సినిమా దంచి కొడుతోంది

అప్పుడప్పుడూ చాలా తక్కువ బడ్జెట్లో తెరకెక్కిన కొన్ని చిన్న సినిమాలు పెద్దగా అంచనాల్లేకుండా వస్తుంటాయి. అవి పాజిటివ్ టాక్ తెచ్చుకుని.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడతాయి. పెట్టుబడి మీద మూణ్నాలుగు రెట్లు ఆదాయం తెచ్చి పెట్టి తిరుగులేని విజయాన్నందుకుంటాయి.

గత ఏడాది క్షణం, పెళ్లిచూపులు లాంటి చిన్న సినిమాలు ఇలాగే స్లీపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు ‘ఆనందో బ్రహ్మ’ కూడా ఈ కోవలోకే చేరేలా ఉంది. దయ్యాల్ని రివర్సులో మనుషులు భయపెట్టడం అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ హార్రర్ కామెడీ ఇప్పుడు టాక్ ఆఫ్ ద టాలీవుడ్‌గా నిలుస్తోంది. ఈ సినిమా వసూళ్లు అనూహ్యంగా ఉన్నాయి.

తొలి రోజు మార్నింగ్ షోకు ఓ మోస్తరుగా మాత్రమే వసూళ్లు వచ్చాయి. కానీ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు.. పాజిటివ్ టాక్ రావడంతో సాయంత్రం నుంచి వసూళ్లు బాగా పుంజుకున్నాయి. వీకెండ్ అంతా అదరగొట్టేసిందీ చిత్రం. వీకెండ్ అయ్యాక, సోమవారం సైతం ఆక్యుపెన్సీ యావరేజ్‌గా 60-70 శాతం ఆక్యుపెన్సీతో సినిమా నడిచినట్లు తెలుస్తోంది. ముందు వారం వచ్చిన క్రేజీ సినిమాలన్నీ రెండో వీకెండ్ తర్వాత పడకేసేయగా.. ‘ఆనందో బ్రహ్మ’ మాత్రం అంచనాల్ని మించి వసూళ్లు రాబడుతోంది. యుఎస్‌లో సైతం ఈ చిత్రానికి చాలా మంచి వసూళ్లు వస్తున్నాయి.

అక్కడ హాఫ్ మిలియన్ మార్కును అందుకునేలా కనిపిస్తోందీ చిత్రం. ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా పెట్టుబడి అంతా రికవర్ అయిపోయినట్లు సమాచారం. ఫుల్ రన్లో ఈ సినిమా నిర్మాతలకు.. బయ్యర్లకు పెట్టుబడి మీద కొన్ని రెట్ల ఆదాయం అందించేలా ఉంది. శాటిలైట్‌‌తో పాటు రీమేక్ హక్కులు కూడా మంచి రేటుకు అమ్ముడయ్యే అవకాశముండటంతో నిర్మాతల పంట పండేట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు