అక్షరాలా అయిదు కోట్లు పోయాయి

అక్షరాలా అయిదు కోట్లు పోయాయి

నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటోన్న దిల్‌ రాజు మరోవైపు పంపిణీదారునిగాను బిజీగానే వున్నాడు. ఈమధ్య వచ్చిన చాలా చిత్రాలని నైజాంలో దిల్‌ రాజే రిలీజ్‌ చేసాడు. నిర్మాతగా సక్సెస్‌ అవుతున్నప్పటికీ పంపిణీదారునిగా మాత్రం దిల్‌ రాజుకి ఎదురు దెబ్బలు తగుల్తున్నాయి.

చెలియా చిత్రానికి పెట్టిన ఖర్చు మొత్తం దండగ అయిపోగా, తాజాగా 'లై'ని నైజాంలో విడుదల చేసిన దిల్‌ రాజుకి దానిపై అక్షరాలా అయిదు కోట్ల నష్టం వచ్చింది. లై చిత్రంపై నమ్మకంతో ఎనిమిది కోట్ల పది లక్షలకి నైజాం హక్కులని దిల్‌ రాజు తీసుకున్నాడు. పది రోజులు తిరిగేసరికి తిరుగుటపాలో వచ్చిన ఆ చిత్రం కేవలం మూడు కోట్ల పది లక్షల రూపాయల షేర్‌ మాత్రం వసూలు చేసింది.

అచ్చంగా అయిదు కోట్ల రూపాయలు నష్టపోయిన దిల్‌ రాజుకి పబ్లిసిటీ, ప్రింట్‌ ఖర్చుల రూపంలో మరికొంత పోతుంది. జయ జానకి నాయక చిత్రాన్ని కూడా దిల్‌ రాజే కొన్నాడు కానీ చివరి నిమిషంలో బేరమాడి ఒక కోటి రూపాయలు తక్కువ చెల్లించాడట. అయినప్పటికీ ఇంకా రెండు కోట్ల వరకు దానిపై రికవర్‌ కావాలంటున్నారు. దానిపై కూడా కోటి రూపాయల కంటే ఎక్కువే పోగొట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు