బాహుబలి వాళ్లకి అస్సలు ఆనదు

బాహుబలి వాళ్లకి అస్సలు ఆనదు

బాహుబలి రెండవ భాగాన్ని చైనాలో వీలయినంత త్వరగా విడుదల చేసి, అక్కడ కూడా హిట్టయితే దంగల్‌ ప్రపంచ వ్యాప్త వసూళ్లని దాటి ఇండియన్‌ నంబర్‌వన్‌ సినిమాగా నిలబడితే చూడాలని నిర్మాతలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ చైనా ప్రభుత్వం దీని రిలీజ్‌కి ఇంకా క్లియరెన్స్‌ ఇవ్వలేదు.

తొలి భాగం చైనాలో ఫ్లాప్‌ అయినా, రెండవ భాగం ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని, అందుకు తగ్గ పబ్లిసిటీ చేద్దామని చిత్ర బృందం ఎదురు చూస్తోంది. అయితే చైనీయులకి ఇలాంటి సినిమాలు కొత్తేమీ కాదు. తరచుగా చైనాలో ఈ తరహా పీరియడ్‌, కాస్టూమ్‌ డ్రామాలు వస్తూనే వుంటాయి. అలాగే పక్క దేశాలైన కొరియా, జపాన్‌ కూడా ఇలాంటి చిత్రాలు ఎక్కువ సంఖ్యలోనే రూపొందిస్తుంటాయి. అందువల్లే బాహుబలి మొదటి భాగం చైనా వారికి అంత ఎక్సయిటింగ్‌గా అనిపించలేదు.

దంగల్‌ విషయానికి వచ్చేసరికి అది పూర్తి స్థాయి ఎమోషనల్‌ డ్రామా కావడం, అలాంటి ఎమోషన్స్‌కి వారు కనక్ట్‌ అవడం వల్ల ఆ స్థాయిలో అక్కడ హిట్టయింది. బాహుబలి రెండవ భాగానికి మొదటి భాగం కంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్టయితే పెద్ద అఛీవ్‌మెంట్‌ అనుకోవాలి. ఎందుకంటే మొదటి సినిమానే పాపులర్‌ కానపుడు ఇక దాని రెండవ భాగం చూడాలని ఎవరు అనుకుంటారు చెప్పండి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు