ఆమె వ‌ల్లే విఐపి 2కి నెగెటివ్ టాక్‌?

ఆమె వ‌ల్లే విఐపి 2కి నెగెటివ్ టాక్‌?

కోలీవుడ్ లో విల‌క్ష‌ణ క‌థ‌ల‌తో వ‌రుస సినిమాలు తీస్తూ దూసుకుపోతున్నాడు ధ‌నుష్‌. త‌మిళ్ తో పాటు కొన్ని బాలీవుడ్ సినిమాల‌లో కూడా న‌టించి త‌న స‌త్తా చాటాడు. ధ‌నుష్ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో విఐపి ఒక‌టి. ఆ సినిమాలో ధ‌నుష్ క్యారెక్ట‌ర్ కు యూత్ బాగా క‌నెక్ట్ అయ్యారు. ఈ సినిమాలోని మదర్ సెంటిమెంట్  బాగా వ‌ర్క‌వుట్ అయింది. దీంతో, ఆ సినిమాను తెలుగులో కూడా ర‌ఘువ‌ర‌న్ బీటెక్ పేరుతో విడుద‌ల చేశారు. ఇక్క‌డ కూడా ఆ సినిమా బంప‌ర్ హిట్ అయింది. అదే ఊపులో ధ‌నుష్ హీరోగా రూపొందిన విఐపి 2 త‌మిళంలో విడుద‌లైంది. కానీ, ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యాన్ని సాధించ‌లేదు.  

త‌మిళ‌నాడులో  విఐపి 2 ప్రేక్షకులను  విఐపి స్థాయిలో మెప్పించలేకపోయిందనే కోలీవుడ్ లో టాక్‌. య‌థాప్ర‌కారం ధ‌నుష్ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. అంతేకాకుండా, ఈ సినిమాకి ధనుష్ మంచి క‌థ‌ను కూడా అందించాడు. అయితే, సినిమా కథ బాగానే ఉన్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కురాలు సౌంద‌ర్య ఫెయిల్ అయింద‌ని వినికిడి.

ధ‌నుష్ క‌థ‌ను ఆడియ‌న్స్ కు చేర‌వేయ‌డంలో సౌంద‌ర్య విఫ‌ల‌మ‌వ‌డంతోనే ఈ సినిమా ఆశించినంత విజ‌యం సాధించ‌లేద‌ని కోలీవుడ్ టాక్‌. సౌంద‌ర్య వ‌ల్లే ఈ సినిమాకు తక్కువ రేటింగ్స్ వ‌స్తున్నాయ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. సౌంద‌ర్య వ‌ల్ల‌నే ధనుష్ హిట్ ను మిస్సయ్యాడనే అభిమానులు అనుకుంటున్నారు. ఈ నెల 25న విడుద‌ల కాబోతున్న తెలుగు విఐపి 2 ప్రేక్ష‌కుల‌ను ఎంత‌వ‌ర‌కు మెప్పిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు