సర్పైజ్ హిట్.. బయటికెళ్తోంది

సర్పైజ్ హిట్.. బయటికెళ్తోంది

ఆనందో బ్రహ్మ.. గత శుక్రవారం పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన చిన్న సినిమా. ఉదయం షోలకు పెద్దగా ఆక్యుపెన్సీ కూడా కనిపించలేదు. కానీ ఈ చిత్రానికి అన్ని వైపులా పాజిటివ్ టాక్ రావడంతో సాయంత్రానికి పుంజుకుంది. అన్ని ఏరియాల్లో థియేటర్లు నిండిపోయాయి. స్టార్ వాల్యూ లేకపోయినప్పటికీ శని.. ఆదివారాల్లో ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడ్డాయి.

గత వారం రిలీజైన మూడు సినిమాలు ఇప్పటికీ బాగా ఆడుతున్నప్పటికీ.. ఆ పోటీని తట్టుకుని 'ఆనందో బ్రహ్మ' మంచి వసూళ్లు రాబట్టడం విశేషమే. రెండు.. మూడు రోజుల్లో ఈ చిత్రానికి థియేటర్లు కూడా పెరగడం విశేషం.

తాజా కబురు ఏంటంటే.. ఈ హార్రర్ కామెడీ మూవీ రీమేక్ కోసం పొరుగు భాషల నుంచి నిర్మాతల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. దక్షిణాదిన మూడు భాషలతో పాటు హిందీ నుంచి కూడా రీమేక్ హక్కుల కోసం ఆరాలు మొదలైనట్లు దర్శకుడు మహి.వి.రాఘవ్ తెలిపాడు. అతనేమీ ఏదో ప్రచారం కోసం చెబుతున్నాడని అనుకోవడానికి లేదు.

ఇప్పటిదాకా వచ్చిన హార్రర్ కామెడీలకు భిన్నంగా దయ్యాల్ని మనుషులు భయపెట్టే కొత్త కథాంశంతో తెరకెక్కడం వల్ల ఈ సినిమా యునీక్ అనిపించుకుంది. తక్కువ బడ్జెట్లో తెరకెక్కడం.. ఏ భాషకైనా కనెక్టయ్యే కామెడీ ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చిన అంశం. అందుకే రీమేక్ కోసం పొరుగు భాషల నుంచి పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English