సన్నీ లియోన్ ఇంత చీపా?

సన్నీ లియోన్ ఇంత చీపా?

మొన్న కేరళలో ఓ షో రూం ఓపెనింగ్ కోసం సన్నీ లియోన్ వెళ్తే అక్కడ ఆమె కోసం జనాలు ఏ స్థాయిలో ఎగబడ్డారో తెలిసిందే. సన్నీని చూసేందుకు భారీ స్థాయిలో కుర్రాళ్లు తరలి రావడంతో ఒక పొడవాటి రోడ్డు నిండిపోయి వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. ఇక షోరూం ఓపెన్ చేసిన ప్రాంతంలో వేదిక ఏర్పాటు చేస్తే.. చుట్టూ ఎటు చూసినా జనమే. సన్నీని చూసేందుకు వేదిక వద్ద జనాలు ఎగబడ్డ తీరు చూసి షాకైపోయారు నిర్వాహకులు. సన్నీకి ఇండియాలో ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పడానికి ఇది తాజా రుజువుగా నిలిచింది.

ఇంతకీ ఆ రోజు షోరూం ఓపెనింగ్ కోసం సన్నీకి ఇచ్చిన పారితోషకం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమెకు రూ.14 లక్షలు మాత్రమే ఇచ్చిందట సదరు సంస్థ. సన్నీ రేంజికి ఇది చాలా తక్కువ మొత్తం అని అభిప్రాయపడుతున్నారు జనాలు.

మామూలుగా అయితే ఈ పారితోషకం విషయంలో అంత ఆశ్చర్యం కలిగేది కాదేమో కానీ.. ఆ రోజు సన్నీ కోసం వచ్చిన జనాల సంఖ్య.. ఆమె వల్ల ఆ షోరూంకు వచ్చిన ప్రచారం ప్రకారం చూస్తే సన్నీ చాలా చీప్‌గా వాళ్లకు దొరికినట్లే. రూ.14 లక్షలిచ్చి దానికి ఎన్నో రెట్లు ప్రచారాన్ని సంపాదించారు. మామూలుగా రూ.50 లక్షలు ఖర్చు పెట్టినా కూడా అంత మంది జనాల్ని రప్పించలేరు.

అంత ప్రచారం పొందలేరు. సన్నీఇంత తక్కువకే వస్తుందంటే.. ఇకపై రాజకీయ నాయకులు కూడా సన్నీని పిలిపించి తమ సభలకు జనాల్ని రప్పించుకోవచ్చేమో కదా!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు