బోయపాటి మ్యాజిక్‌ పని చేస్తుందహో

బోయపాటి మ్యాజిక్‌ పని చేస్తుందహో

మొదటి వారంలో 'నేనే రాజు నేనే మంత్రి' తాకిడి ఇబ్బంది పడ్డ 'జయ జానకి నాయక' సెకండ్‌ వీకెండ్‌లో మాత్రం దాని కంటే చాలా బెటర్‌గా పర్‌ఫార్మ్‌ చేసింది. తొలి వారంలో 'నేనే రాజు', 'లై' ఎక్కువ థియేటర్లు ఆక్రమించడంతో 'జయ జానకి నాయక'కి సరిపడా థియేటర్లు దొరకలేదు.

అందులోను ఈ చిత్రం బాగా కనక్ట్‌ అయ్యే బి, సి సెంటర్స్‌లో థియేటర్లు దొరకనివ్వలేదు. రెండవ వారంలో మరో వంద థియేటర్లు పెంచడంతో 'జయ జానకి నాయక'కి అప్పర్‌ హ్యాండ్‌ దక్కింది. రెండవ వారానికి డ్రాప్‌ అయిపోతుందని అనుకున్న చిత్రం ఈ వారంలో మిగతా సినిమాల కంటే బాగా వసూలు చేయడంతో పబ్లిక్‌ టాక్‌ ఈ చిత్రానికి అనుకూలంగా వుందనే సంగతి స్పష్టమైంది.

అయితే ఈ సెకండ్‌ వీకెండ్‌ బాగా వున్నంత మాత్రాన ఈ చిత్రం ఇంకా గట్టెక్కినట్టు కాదు. 'నేనే రాజు నేనే మంత్రి' తరహాలో ఇది చిన్న బడ్జెట్‌ సినిమా కాదు కనుక ఇప్పటికి వచ్చింది సరిపోదు. బయ్యర్లు తమ పెట్టుబడిని వెనక్కి రాబట్టుకోవాలంటే ఈ చిత్రం మరికొన్ని రోజుల పాటు ఇలాగే ఆడాలి.

ఆనందో బ్రహ్మ కానీ ఈ శుక్రవారం విడుదలయ్యే అర్జున్‌ రెడ్డి కానీ దీనికి పోటీ కాదు కనుక సేఫ్‌ జోన్‌కి చేరుకోవడానికి అనుకూల సమయమే. బోయపాటి మ్యాజిక్‌తో ఇంతవరకు లాగిన ఈ చిత్రం ఇకపై కూడా ముందుకెళ్లి బయ్యర్లని ఒడ్డున పడేస్తుందా లేదా అనేది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు