న్యూడిటీ దిశగా బాలీవుడ్‌ బ్యూటీస్‌

న్యూడిటీ దిశగా బాలీవుడ్‌ బ్యూటీస్‌

హాలీవుడ్‌ హీరోయిన్లు, వరల్డ్‌ సినిమాల్లో చాలా మంది అగ్ర తారలు కథ డిమాండ్‌ చేస్తే పూర్తి నగ్నంగా నటించడానికి వెనకాడరు. ఈ విషయంలో ఇండియన్‌ సినిమా చాలా కన్‌జర్వేటివ్‌గా వుండేది. మన సెన్సార్‌ చాలా స్ట్రిక్ట్‌ కావడంతో నగ్న దృశ్యాలు అనేవి మన సినిమాల్లో చాలా అరుదు.

ఒకవేళ నగ్న దృశ్యాలున్నా కానీ విదేశాల్లోనే అవి బయటకి వస్తాయి తప్ప మన థియేటర్లలో ఎడిట్‌ అయిపోతుంటాయి. కానీ ఈమధ్య బాలీవుడ్‌ తారలు నగ్నత్వం దిశగా అడుగులు వడివడిగా వేస్తున్నారు. న్యూడ్‌గా కనిపించడానికి కేవలం సినిమాలనే మాధ్యమంగా చేసుకోవడం లేదు.

సోషల్‌ మీడియా ద్వారా తమ నగ్న చిత్రాలని విడుదల చేయడానికి కొందరు జంకడం లేదు. ఈమధ్య కాలంలో ఈ ట్రెండు మరీ ఎక్కువ అయిపోవడంతో త్వరలోనే వెండితెరపై కూడా నగ్న దృశ్యాలు కామన్‌ ఫీచర్‌ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈషా గుప్తా, కల్కి కొచ్లీన్‌ తమ నగ్న చిత్రాలతో సోషల్‌ మీడియాలో ఎంత సంచలనం చేసారనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

బికినీలని దాటి మన హీరోయిన్లు న్యూడిటీ వైపుగా సాగిపోతున్నారు. రాధికా ఆప్టే లాంటి వాళ్లు తెరపై నగ్నంగా కనిపించడానికి కూడా అస్సలు సిగ్గు పడడం లేదు. మన సెన్సార్‌ బోర్డు కూడా వరల్డ్‌ సినిమా తీరున జోనర్స్‌కి అనుగుణంగా సెన్సార్‌ చేయాలనే డిమాండ్లు పెరుగుతోన్న నేపథ్యంలో సాంప్రదాయ విలువలకి భారతీయ చిత్ర పరిశ్రమ తొందర్లోనే చరమ గీతం పాడుతుందని అనుకోవచ్చా?