చుక్కలు చూపిస్తోన్న రజనీకాంత్‌ కూతురు

చుక్కలు చూపిస్తోన్న రజనీకాంత్‌ కూతురు

రజనీకాంత్‌ కూతురి హోదాలో దర్శకురాలి అవతారం ఎత్తిన సౌందర్య రజనీకాంత్‌ తను తీసిన చిత్రాలతో బయ్యర్లకి చుక్కలు చూపిస్తోంది. యానిమేషన్‌పై కోర్స్‌ చేసిన సౌందర్య ముందుగా తండ్రితో మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీతో కొచ్చడయ్యాన్‌ చేసింది. ఆ చిత్రం అన్ని భాషల్లోను డిజాస్టర్‌ అయింది. ఆ చిత్రానికి వచ్చిన నష్టాలతో బెంబేలెత్తిపోయిన బయ్యర్లు నష్ట పరిహారం కోసం రజనీ ఇంటి ముందు క్యూ కట్టారు.

ఈసారి సోషల్‌ మూవీ తీయడానికి ఆమె 'విఐపి' అనే సక్సెస్‌ఫుల్‌ సినిమాకి సీక్వెల్‌ తీసింది. తన అక్క భర్త ధనుష్‌తోనే విఐపి2 చేసిన సౌందర్య మరోసారి తన 'టాలెంట్‌' చూపించింది. విఐపి ఎంత పెద్ద హిట్టో ఈ సీక్వెల్‌ అంతగా డిజప్పాయింట్‌ చేసింది. దర్శకురాలికి విఐపి అసెన్స్‌ తెలియలేదని, ఆ చిత్రం సోల్‌ని పట్టినట్టయితే మరో సినిమాని ఆ ఫ్రాంచైజీలో తీసి వుండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ధనుష్‌ మంచి కథే ఇచ్చినా కానీ తన దర్శకత్వంతో సౌందర్య దానిని చెడగొట్టి విమర్శల పాలయింది. మామూలుగా డిప్లమసీ చూపించే తమిళ విమర్శకులు ఈ చిత్రాన్ని ఒకటిన్నర రేటింగులు ఇచ్చి కసి తీర్చుకున్నారు. డైరెక్షన్‌ తన కప్‌ ఆఫ్‌ టీ కాదని సౌందర్య ఇప్పటికైనా గ్రహిస్తుందా లేక గజిని మొహమ్మద్‌లా మళ్లీ మళ్లీ దండయాత్రలు కొనసాగిస్తుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు