కుర్రోడు మహా కాంట్రవర్షియల్‌ అండీ

కుర్రోడు మహా కాంట్రవర్షియల్‌ అండీ

విజయ్‌ దేవరకొండ ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్‌ అయిపోయాడు. పెళ్లిచూపులుతో యువతకి దగ్గరైన విజయ్‌ 'అర్జున్‌ రెడ్డి'తో స్టార్‌గా ఎదగాలని చూస్తున్నాడు. మామూలుగా బ్యాక్‌గ్రౌండ్‌ లేని నటీనటులు కాస్త డిప్లమాటిక్‌గా వ్యవహరిస్తుంటారు. కాంట్రవర్సీల జోలికి పోకుండా సైలెంట్‌గా వుండడానికే మొగ్గు చూపుతారు. కానీ విజయ్‌ దేవరకొండ మాత్రం అవసరమైతే తన గళమెత్తడానికి మొహమాట పడడం లేదు.

పెళ్లిచూపులు చిత్రాన్ని ఫ్యామిలీస్‌ కోసం చేసానని, అర్జున్‌ రెడ్డిని అడల్ట్స్‌ కోసం చేస్తున్నానని, అన్ని అభిరుచులున్న ప్రేక్షకులకి దగ్గర కావడం తప్పేమీ కాదని ఈ చిత్రంలో వున్న అడల్ట్‌ కంటెంట్‌ గురించి అతను స్పందించాడు. ఈ చిత్రం పోస్టర్లు అసభ్యకరంగా వున్నాయంటూ కాంగ్రెస్‌ నాయకుడు వి. హన్మంతరావు బస్సులపై అంటించిన అర్జున్‌ రెడ్డి పోస్టర్లు చించేస్తే, ఆ వీడియో పోస్ట్‌ చేసి 'తాతయ్యా, చిల్‌' అంటూ విజయ్‌ కామెంట్‌ చేయడం సంచలనమైంది.

రాజకీయ నాయకులని కామెంట్‌ చేస్తే ఎంత రచ్చ చేస్తారనేది తెలిసిందే. కానీ విజయ్‌ మాత్రం తనకి అలాంటి భయాలేమీ లేవని ఈ కామెంట్‌ ద్వారా తెలియజేసాడు. కాంట్రవర్షియల్‌ సినిమా చేసినపుడు తాను మెతకగా వుంటే సరి కాదని విజయ్‌ గ్రహించాడో లేక స్వతహాగానే తను కాంట్రవర్షియలో తెలియదు కానీ ఈ కామెంట్‌ ద్వారా ఈ చిత్రానికి మరింత పబ్లిసిటీ తెచ్చి పెట్టాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు