‘పిట్టంత’ హీరోలపై తేజ సెటైర్

‘పిట్టంత’ హీరోలపై తేజ సెటైర్

మామూలుగానే తేజ బోల్డ్ కామెంట్స్ చేస్తుంటాడు. టాలీవుడ్ హీరోలపై సెటైర్లు వేస్తుంటాడు. అందులోనూ లేక లేక ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో హిట్టు కొట్టేసరికి ఆయన మాటల దూకుడు మరింత పెరిగింది. టాలీవుడ్లో కొందరు హీరోలపై తేజ సెటైర్లు వేశాడు. పేర్లెత్తకుండా ‘పిట్టంత’ హీరోలు అంటూ కొందరిని టార్గెట్ చేసుకున్నాడు తేజ.

తెలుగు సినిమాల్లో హీరోల్ని మరీ ఎక్కువగా చూపిస్తుంటారని.. హీరో కొడితే పది మంది ఒకేసారి ఎగిరిపడినట్లు సన్నివేశాలుంటాయని.. ఐతే చిరంజీవో.. బాలకృష్ణో.. ప్రభాసో కొడితే పది మంది పడిపోతారంటే కొంచెం నమ్మొచ్చని.. కానీ పిట్టంత హీరోలకు కూడా ఇదే బిల్డప్ ఇస్తున్నారని.. వాళ్లు కొడితే రౌడీలు అంత మంది ఎగిరి పడ్డట్లు చూపిస్తున్నారని.. ఇలాంటివి జనాలకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తాయని తేజ అన్నాడు. మరి తేజ ఇక్కడ పర్టికులర్‌గా ‘పిట్టంత హీరోలు’ అని ఎవరిని అన్నాడో అన్న చర్చ మొదలైంది.

మరోవైపు తన ద్వారా అవకాశాలు అందుకుని, ఇప్పుడు తనను పట్టించుకోని నటీనటులపైనా తేజ సెటైర్లు వేశాడు. చాలా మంది తన విషయంలో కృతజ్నత చూపించలేదని.. ఐతే వాళ్ల నుంచి కృతజ్నత ఆశిస్తే తనకంటే పనికి మాలిన వాడు మరొకడు ఉండడని.. అలాంటి వాళ్లను చూస్తే తనకు కోపం ఏమీ లేదని.. కానీ గొంగళి పురుగును చూసినపుడు కలిగే జుగుప్స మాత్రం కలుగుతుందని తేజ అన్నాడు. ఇకపై తాను కొత్తవాళ్లతో సినిమాలు తీయాలనుకోవట్లేదని.. వాళ్లతో సినిమా శుద్ధ దండగ అని.. తన కథకు తగ్గ పేరున్న నటీనటులతోనే సినిమా చేయాలనుకుంటున్నానని తేజ చెప్పడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు