నాలుగు చోట్ల ‘ఒక్కడు మిగిలాడు’

నాలుగు చోట్ల ‘ఒక్కడు మిగిలాడు’

మంచు మనోజ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘ఒక్కడు మిగిలాడు’. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం ఎల్టీటీఈని స్థాపించి.. సుదీర్ఘ పోరాటం జరిపిన వేలుపిళ్లై ప్రభాకరన్ జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కిన సినిమా ఇది. మనోజ్ ఇందులో ప్రభాకరన్ పాత్రతో పాటు స్టూడెంట్ లీడర్‌గా మరో పాత్ర కూడా చేస్తున్నాడు. అజయ్ నూతక్కి రూపొందించిన ఈ సినిమా సెప్టెంబరు 8న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

తెలుగు-తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఇంకో రెండు భాషల్లోకి అనువదించనున్నారట. శ్రీలంకలో తమిళులు పడ్డ ఇబ్బందులు.. వారి పోరాటం గురించి దేశం మొత్తానికి తెలియాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని హిందీ.. మలయాళ భాషల్లోకి కూడా అనువాదం చేసి దేశమంతటా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు మనోజ్ తెలిపాడు.

ఈ చిత్రం కోసం ఏడాదిన్నర పాటు ప్రాణం పెట్టి పని చేశామని.. సినిమా అద్భుతంగా వచ్చిందని.. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాలకు కూడా ఈ చిత్రాన్ని పంపాలనుకుంటున్నామని మనోజ్ తెలిపాడు. జీవితంలో కొన్ని సినిమాల గురించే ఎప్పుడూ చెప్పుకుంటామని.. అలా తన జీవితంలో గర్వంగా చెప్పుకునే సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ అని.. కేవలం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కాబట్టే ఇది ప్రత్యేకం కాదని, కథ విషయంలోనే ఇది గొప్ప సినిమా అని.. ఇలాంటి సినిమా కోసం ఎంత కష్టమైనా పడొచ్చని మనోజ్ అభిప్రాయపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English