పూరి మీద సెటైర్లేసిన హీరోయిన్

పూరి మీద సెటైర్లేసిన హీరోయిన్

‘భారతీయుడు’ సినిమాలో కమల్ హాసన్ చెల్లెలి పాత్ర పోషించడంతో పాటు 90ల్లో తెలుగులో పలు సినిమాల్లో కథానాయికగా నటించిన కస్తూరి గుర్తుంది కదా. పెళ్లి తర్వాత పత్తా లేకుండా పోయిన ఈమె.. ఈ మధ్య హాట్ హాట్ కామెంట్లతో వార్తల్లో నిలుస్తోంది. సూప్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం విషయంలో సెటైర్లు గుప్పించి ఆయన అభిమానుల ఆగ్రహానికి గురైన కస్తూరి.. ఊహించని విధంగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీద సెటైర్లు గుప్పించింది.

నందమూరి బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టడం గురించి ‘పైసా వసూల్’ ఆడియో వేడుకలో పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. అది బాలయ్యకు, అభిమానులకు మధ్య లవ్ స్టోరీ అని.. దాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని కవర్ చేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. పూరి మీద ఘాటైన సెటైర్లు వేసింది.

అభిమానుల్ని బాలయ్య కొట్టడంలో తప్పు లేదన్నట్లు పూరి మాట్లాడుతున్నాడని.. దీన్ని బట్టి చూస్తే పూరి మీద డ్రగ్స్ ఆరోపణలు ఏ ఆధారాలు లేకుండా రాలేదని తెలుస్తోందన్నట్లుగా కస్తూరి వ్యాఖ్యానించడం విశేషం. బాలయ్య విషయంలో పూరి చేసిన సమర్థన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి వాస్తవమే. ఐతే ఈ వ్యవహారంలో మన సెలబ్రెటీలెవ్వరూ కూడా పెదవి విప్పలేదు. అందరూ సైలెంటుగా ఉన్నారు. ఐతే తెలుగు సినిమాతో ఎప్పుడో కనెక్షన్ కట్ అయిపోయిన కస్తూరి.. అనూహ్యంగా దీనిపై స్పందించడం.. పూరి మీద ఇలా కౌంటర్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు