ఆ హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంటా?

ఆ హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంటా?

మంచు మనోజ్ సరసన ‘నేను మీకు తెలుసా’లో కథానాయికగా నటించిన బాలీవుడ్ భామ రియా సేన్ తన లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ శివమ్ తివారిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఐతే పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న రియా సేన్ పెళ్లిని మరీ సింపుల్ గా... ఏ హంగామా లేకుండా.. చాలా తక్కువమంది జనాల మధ్య హడావుడిగా జరిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

రియా సేన్.. అలనాటి అందాల తార మున్ మున్ సేన్ కూతురన్న సంగతి తెలిసిందే. వీళ్ల ఫ్యామిలీకీ చాలా పెద్ద బ్యాగ్రౌండే ఉంది. దాని ప్రకారం చూస్తే రియా పెళ్లి జరిగిన తీరు ఆశ్చర్యకరమే. ఐతే ఓ ఇంగ్లిష్ డైలీ కథనం ప్రకారం రియా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందట. బాలీవుడ్లో ఇలా ప్రెగ్నెంట్ అయ్యాక.. పెళ్లిళ్లు చేసుకోవడం కొత్తేమీ కాకపోయినప్పటికీ మున్ మున్ సేన్ ఫ్యామిలీ మాత్రం ఆ విషయాన్ని కవర్ చేసి హడావుడిగా పెళ్లి చేసినట్లుగా ఆ కథనంలో పేర్కొన్నారు. రియా-శివమ్ ఆరేడేళ్ల కిందట్నుంచే ప్రేమలో ఉన్నారు. చివరికి 35 ఏళ్ల వయసులో రియా.. శివమ్ ను పెళ్లి చేసుకుంది.

బాలీవుడ్లో చాలామంది ప్రముఖ తారలు పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయ్యారు. మన అతిలోక సుందరి శ్రీదేవి.. బోనీ కపూర్ ను పెళ్లాడే సమయానికి ఏడు నెలల గర్భవతి కావడం విశేషం. పెళ్లి తర్వాత శ్రీదేవే ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కొంకనా సేన్.. సెలీనా జైట్లీ.. లిసా హేడెన్.. ఇలా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు బాలీవుడ్లో ఇంకా చాలామందే ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు